
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా డెవిల్. బింబిసార, అమిగోస్ తర్వాత ఆయన నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో క్యూరియాసిటి పెంచేసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ చూస్తుంటే ఈసారి మరో విభిన్నమైన కథతో అడియన్స్ ముందుకు రాబోతున్నారని అర్థమవుతోంది. ఈ చిత్రానికి బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అని ట్యాగ్ లైన్ పెట్టడంతో మరింత ఆసక్తి నెలకొంది. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్‌తో హైప్ క్రియేట్ చేశారు.
ఈ సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. పట్టుచీరలో మరింత అందంగా కనిపించింది. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ‘మాయే చేసి మెల్లగా మది దొచేసిందే సిన్నగా’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను కట్టిపడేస్తోంది. ఇప్పటివరక్ సిద్ పాడిన పాటలన్ని సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సాంగ్ కూడా హిట్ కావడం ఖాయమని తెలుస్తోంది.
A melody that lingers in your soul! 😍
Here’s the soothing #MaayeChesi from #Devil ❤️
– https://t.co/H0ZkkKAoZI#DevilMusical
🎙️ @sidsriram
✍🏻 #SatyaRVV
🎵 @rameemusic#Devil – The British Secret Agent
డెవిల్ – डेविल – டெவில் – ಡೆವಿಲ್ – ഡെവിൽ#DevilonNov24th… pic.twitter.com/aH2kt1ZcS4— ABHISHEK PICTURES (@AbhishekPicture) September 19, 2023
స్వాతంత్ర్యం రాకముందు బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. తాజాగా విడుదలైన పాటలో హీరోహీరోయిన్ కస్ట్యూమ్స్, మేకప్ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్ 24న రిలీజ్ చేయనున్నారు. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
👸Prepare to be spellbound by the alluring #DevilsAngel 😈😇, @iamsamyuktha_ !
Excited to introduce the talented and beautiful Samyuktha as Nyshadha.
Sending warm birthday wishes to the incredible! May your special day be filled with love, happiness, and countless blessings.… pic.twitter.com/MWPFZ4A8qA
— ABHISHEK PICTURES (@AbhishekPicture) September 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.