Maa Elections 2021: ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్ డబ్బులు పంచుతుందట..! ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ కామెంట్స్‌

Maa Elections 2021:'మా' ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. పోటీలో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్, మంచు విష్ణు టీం ఉన్న సంగతి తెలిసిందే.

Maa Elections 2021: ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్ డబ్బులు పంచుతుందట..! మా అధ్యక్షుడు నరేశ్‌ కామెంట్స్‌
Naresh

Edited By:

Updated on: Oct 10, 2021 | 8:36 AM

Maa Elections 2021:’మా’ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. పోటీలో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్, మంచు విష్ణు టీం ఉన్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ మంచు విష్ణు ప్యానెల్‌కి మద్దుతు తెలుపుతున్నారు. రేపు ఎన్నికల సందర్భంగా ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్ డబ్బులు పంచుతుందని నరేశ్‌ ఓ వీడియోను విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు.

‘ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్‌ డబ్బులు పంచుతోంది.. ఒక్కొక్కరికి 10వేల నుంచి 25 వేల వరకు అందిస్తోంది. మూడు, నాలుగు సెంటర్లలో డబ్బులు పంచడం ప్రారంభించారు. డబ్బు మాత్రమే గెలుస్తుందని ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్ మ్యానిఫెస్టో కూడా విడుదల చేయలేదు. మా మెంబర్స్‌ని లోబరుచుకుంటున్నారు. నేను సభ్యులకు ఒక్కటే చెబుతున్నా డబ్బులిస్తే తీసుకోండి కానీ మంచు విష్ణుకు మాత్రమే ఓటు వేయండని’ అన్నారు.

అలాగే ‘విష్ణు ప్యానెల్‌ నుంచి డబ్బులు రావు. నేను కరోనా సమయంలో డబ్బులు పంచితేనే చాలా కామెంట్స్‌ చేశారు. ‘మా’ ఎలక్షన్స్‌ కోసమే ఇదంతా చేస్తున్నావని ఆరోపించారు. ఇప్పుడు ప్రత్యర్థి ప్యానెల్ డబ్బులు పంచుతోంది. డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం మీ మనస్సాక్షికి వేయండి. మంచు విష్ణుకే ఓటేయండి. నేను అంతకంటే కోరను. ‘మా’ ఎలక్షన్లకు సంబంధించి ఇదే నా చివరి వీడియో’ అని ముగించారు.

Maa Elections 2021: నాగబాబుకు మంచు విష్ణు కౌంటర్.. ‘కుటుంబం జోలికొస్తే సహించేది లేదు’..