Maa Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానెల్‌తోపాటు నాగబాబు రాజీనామాను తిరస్కరించిన ఈసీ..

|

Oct 23, 2021 | 9:45 PM

మా ఎన్నికలు మొన్నటివరకు.. సాధారణ ఎన్నికల కంటే మించి మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు జరిగాయి. ముందుగా మా అధ్యక్ష పదివికి ఐదుగురు పోటీకి దిగారు.

Maa Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానెల్‌తోపాటు నాగబాబు రాజీనామాను తిరస్కరించిన ఈసీ..
Maa
Follow us on

Maa Elections 2021: మా ఎన్నికలు మొన్నటివరకు.. సాధారణ ఎన్నికల కంటే మించి మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు జరిగాయి. ముందుగా మా అధ్యక్ష పదివికి ఐదుగురు పోటీకి దిగారు. చివరకు ఇద్దరు పోటీలో మిగిలారు. ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు మధ్య పోటీ జరిగింది. చివరకు రసవత్తరంగా సాగిన ఎన్నికల్లో విష్ణు విజయం సాధించారు. ‘మా’ ఎన్నికలు.. అందులో ఓటమిని అంత ఈజీగా ప్రకాష్ రాజ్‌ మరచిపోయేలా కనిపించడం లేదు. అక్రమాలు, అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ.. ఆ నిజాలన్నీ జనాలందరికి తెలపాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది.

పోలింగ్‌, కౌంటింగ్ ప్రక్రియలో సామాజిక వ్యతిరేకుల ఉనికి ఉందంటూ పదేపదే ప్రశ్నించాం. అలాంటి వారిని కౌంటింగ్‌ ప్రాంతాలకు అనుమతించారని ఆరోపించాం. కానీ ఆ ఆరోపణలు మీరు ఖండించారంటూ ఈసీ రాసిన లేఖలో పేర్కొన్నారు ప్రకాష్ రాజ్. మరో వైపు ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న సభ్యులు మొత్తం రాజీనామా చేశారు. అలాగే నటుడు నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే తమ రాజీనామాలు అంగీకరించాలని మంచు విష్ణుతో పాటు ఈసీని కూడా కోరారు ప్రకాష్ రాజ్. ఈ నేపథ్యంలో మా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రెండు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో సభ్యుల రాజీనామాలతోపాటు.. మేనిఫెస్టోలో ప్రకటించిన 14 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు, నాగబాబు రాజీనామాలు ఈసీ తిరస్కరించింది. రాజీనామాలు విరమించుకుని పదవుల్లో కొనసాగే వలసిందిగా విజ్ఞప్తి చేస్తూ లెటర్లు రాయాలని తీర్మానించారు. అదేవిధంగా సభ్యుల ఆరోగ్య సంక్షేమం కోసం పలు కార్పొరేట్ హాస్పిటల్‌తో ఒప్పందాలు కూడా చేసుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral News: బీహార్‌లో హాట్ టాపిక్‌గా మారిన నటుడు రామిరెడ్డి.. తెలుగు దివంగత నటుడు అక్కడ ఎందుకనేగా..

RK Selvamani: దర్శకుడు సెల్వమణి బర్త్ డే వేడుకలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్..

Mahesh Babu: సర్కారు వారి పాటకు శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులు.. సినిమా సెట్‌లో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ..