Maa Elections 2021: రేపే అసలైన పోరు.. మా ఎన్నికల తుది అంకానికి సర్వం సిద్ధం.. భారీ బందోబస్తు..

|

Oct 09, 2021 | 6:28 PM

కొన్ని నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న రాజకీయాలకు తెర పడబోతుంది. విమర్శలు, ఆరోపణలు... సవాల్లు.. ప్రతి సవాల్లు..

Maa Elections 2021: రేపే అసలైన పోరు.. మా ఎన్నికల తుది అంకానికి  సర్వం సిద్ధం..  భారీ బందోబస్తు..
Maa
Follow us on

కొన్ని నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న రాజకీయాలకు తెర పడబోతుంది. విమర్శలు, ఆరోపణలు… సవాల్లు.. ప్రతి సవాల్లు.. నువ్వా నేనా అంటూ సాగిన పోరుకు రేపటితే తుది తీర్పు రానుంది. నోటిఫికేషన్ రాకముందే నుంచి సినీ పరిశ్రమలో ఎన్నికల హడావిడి మొదలైంది. నలుగురు నుంచి ముగ్గురికి… ఆతర్వాత ఇద్దరికి చేరింది.. అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య.. ఇప్పటికే బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ము తమ ప్యానల్ సభ్యులతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక రేపు (అక్టోబర్ 10న) మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 71లో జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతున్నాయి. ఇందుకోసం జూబ్లీ హిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

మా ఎన్నికలకు మొత్తం మూడు గదుల్లో 12 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఒకేసారి ఒక గదిలో నలుగురు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఇందుకు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మా ఎన్నికల కోసం మూడు ప్లటూన్ల బలగాలను వినియోగిస్తున్నారు. ఇందులో ఒక ఉమెన్ ప్లటూన్ కూడా ఉండనుంది. ఎన్నికల ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశం లేకుండా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. మా ఎన్నికల్లో మొత్తం 883 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తమ ప్యానల్ సభ్యులతో కలిసి పోలీసులుతో ఓటింగ్ జరుగనున్న ప్రాంతంలో సమావేశమయ్యారు.

Also Read: Rashmika Mandanna Photos: ఓరచూపుతో కవ్విస్తున్న కన్నడ సోయగం.. ఎక్స్‏ప్రెషన్ క్వీన్ రష్మిక మందన్న ఫోటోస్ పై ఓ లుక్కెయ్యండి..

After Divorce Samantha: తీపి జ్ఞాపకాలలో ఒంటరిగా ‘సమంత’ ప్రయాణం.. విడాకుల తర్వాత సామ్ షేర్ చేసి ఫోటోస్..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ సీజన్ 5 ఎలిమినేషన్ ట్విస్ట్.. మరోసారి అమ్మాయి కోసం అబ్బాయి బలి ..?

MAA Election 2021: క్లైమాక్స్ కి చేరిన ‘మా’ ఎన్నికల సీన్… ప్రకాష్ రాజ్ vs మంచు విష్ణు.. గెలుపెవరిది..?(లైవ్ వీడియో)