Maa Crisis: మా ఎన్నికల వేడి రగులుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రకాష్ రాజ్ ఆధ్వర్యంలో అందరూ మీడియాతో మాట్లాడుతున్నారు., ఈ సందర్భంగా బెనర్జీ చాలా ఎమోషన్ అయ్యారు. ”నాకు మూడు రోజుల నుంచి నిద్రలేదు. నన్ను మోహన్ బాబు అరగంట తిడుతూనే ఉన్నారు. ఎందుకు అలా చేశారో అర్ధం కాలేదు. దారుణంగా మాట్లాడారు. నేను ఎప్పుడూ ఇటువంటి మాటలు పడలేదు. ఎన్నికల్లో పాల్గొన్నందుకు అన్ని మాటలు మాట్లాడతారా? మంచు విష్ణు వచ్చి నన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ, నేను ఎటువంటి పరిస్థితిలో దీనిని తట్టుకోలేకపోతున్నాను.” అంటూ ఆయన చెప్పారు.
”మంచు లక్ష్మిని ఎత్తుకుని తిరిగాను. కానీ, మోహన్ బాబు నన్ను బండ బూతులు తిట్టారు. కొట్టడానికి వచ్చారు. మోహన్ బాబు ఎందుకు తిట్టరనేది నాకు అర్ధం కావడం లేదు.” అంటూ బెనర్జీ ఎమోషన్ అయ్యారు.
Also Read: Tanish: ‘మోహన్ బాబు అమ్మను తిడితే తట్టుకోలేకపోయా’.. తనీష్ ఎమోషనల్ కామెంట్స్