తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పాటల రచయితలలో అనంత్ శ్రీరామ్ ఒకరు. ప్రతి సినిమాలోని ఆయన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తెలుగు భాషను ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ప్రతి పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఆయన మాటలలో చాలా డెప్త్ ఉంటుంది. అనంత్ శ్రీరామ్ మాట్లాడితే సినీ ప్రముఖులు, దర్శకనిర్మాతలు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతుంటారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయిన పాటలలో అనంత్ శ్రీరామ్ సాంగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అయితే అనంత్ శ్రీరామ్ ఒక్కో పాటకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటారని అంటారు. కానీ అనంత్ శ్రీరామ్ లైఫ్ స్టైల్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ స్టైల్ గురించి చెప్పుకొచ్చారు.
ఆడంబరాల కోసం అప్పులు చేయడం అతి పెద్ద తప్పని. అప్పులు చేయడం వల్ల ఇబ్బందులు తప్పవని అన్నారు. తన ముత్తాత అప్పట్లోనే లక్ష రూపాయలు అప్పు చేసి తన తాత మీద వేసి చనిపోయారని.. ఆ అప్పు తీర్చడానికి తన తాత ఎంత కష్టపడ్డారో తనకు తెలుసని.. ఆయన జీవితం మొత్తం చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేశారని గుర్తుచేసుకున్నారు. అప్పును తీర్చడంతోపాటు మిగిలి ఉన్న ఆస్తిని కాపాడటం కోసమే ఆయన జీవితం త్యాగం చేయాల్సి వచ్చిందని అన్నారు. అప్పు చేయడం అనేది అతి పెద్ద తప్పు అని అన్నారు. తన తాతలాగే తాను కూడా సింపుల్ లైఫ్ గడపడం.. తదుపరి తరాలకు మంచి చేయాలనే ఉద్దేశం అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆడంబరాల కోసం అప్పులు చేయడం వల్ల చివరకు అశాంతి మిగులుతుందని అనంత్ శ్రీరామ్ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈఎంఐ ద్వారా కార్లు, ఇల్లు కొనుగోలు చేసి జీవితాన్ని చాలా లగ్జరీగా గడపవచ్చు అనీ.. కానీ ఆ అప్పు చేయాలని అనుకోవడం లేదని అన్నారు. డబ్బు ఉంటేనే కొంటానని.. లేదంటే ఉన్నట్లుగానే జీవితాన్ని సాగిస్తానని.. అంతేకానీ లగ్జరీ వస్తువల కోసం అప్పులు చేయాలని తాను ఎప్పుడు అనుకోనని అన్నారు. అప్పులు చిన్నవే అనుకుంటాం కానీ.. వాటి వల్ల మనసుకు అశాంతి కలగడం.. కుటుంబంలో గొడవల వరకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయని అన్నారు.
ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..
Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్ లుక్లో తారక్.. వేరేలెవల్ అంతే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.