Chandrabose: ఇండస్ట్రీలో మరో విషాదం.. గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు మృతి

ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన కన్నుమూశారు. దాంతో చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు చంద్రబోసు సోదరుడు రాజేంద్ర. ఆయన మరణం పై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Chandrabose: ఇండస్ట్రీలో మరో విషాదం.. గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు మృతి
Chandrabose

Updated on: May 03, 2026 | 5:46 PM

ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఇంట విషాదం చోటు చేసుకుంది.  చంద్రబోస్ సోదరుడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంతో చంద్రబోస్ ఇంట విషాదం చోటు చేసుకుంది. చంద్రబోస్‌ సోదరుడు రాజేంద్ర (60) గుండెపోటుతో మరణించారు. బిజినెస్ కోసమని బెంగుళూరు వెళ్లిన ఆయన అక్కడి నుంచి అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలోని తన స్నేహితుడు శ్రీనివాసరెడ్డి నివాసంలో శనివారం రాత్రి ఉన్నారని తెలుస్తుంది. అదే సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా

ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురవడంతో .. ఆయనను వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు.. దాంతో ఆయన కోలుకున్నారు. అనంతరం కలికిరి క్రాస్ రోడ్‌కు చేరుకుని, హోటల్‌లో టిఫిన్ చేశారు. అనంతరం ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కలికిరి పోలీసులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!

చంద్రబోస్ సోదరుడి మరణంతో ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సినీ ప్రముఖులు చంద్రబోస్ సోదరుడి మరణానికి సంతాపం తెలుపుతున్నారు. టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన పాటలను రచించారు చంద్రబోస్, ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన రాసిన నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే..

ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us