Shekar Movie : రాజశేఖర్ ‘శేఖర్’ సినిమానుంచి హుషారైన పాట.. ‘లవ్ గంటే’ అంటూ స్టెప్పులేసిన సీనియర్ హీరో..

|

Jan 05, 2022 | 5:09 PM

సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శేఖర్. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు రాజశేఖర్. 

Shekar Movie : రాజశేఖర్ శేఖర్ సినిమానుంచి హుషారైన పాట.. లవ్ గంటే అంటూ స్టెప్పులేసిన సీనియర్ హీరో..
Shekar
Follow us on

Shekar movie : సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శేఖర్. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు రాజశేఖర్. క్రమంలోనే శేఖర్ అనే సినిమా చేస్తున్నారు. . రాజశేఖర్‌ సతీమణి జీవితా రాజశేఖర్‌ మరోసారి మెగా ఫోన్‌ పట్టి స్వయంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆత్మీయ రాజన్, ముస్కాన్, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవి వర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. . బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌ సంయుక్త భాగస్వామ్యంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇది రాజశేఖర్‌ నటిస్తోన్న 91వ చిత్రం. పైగా జీవితా రాజశేఖర్‌ చాలా కాలం తర్వాత దర్శకత్వ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు.

తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ‘లవ్ గంటే’ అనే హుషారైన పాట అందరినీ అలరిస్తుంది. అనూప్ రూబెన్స్ బాణీలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. శేఖర్’ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో రాజశేఖర్ కుమార్తెలు కూడా భాగస్వాములు. మలయాళంలో హిట్టయిన ‘జోసెఫ్’ చిత్రాన్ని శేఖర్ గా రీమేక్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లిమ్ప్స్ ఆకట్టుకున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారి వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా.!

Megastar Chiranjeevi: సేనాపతిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. రాజేంద్రప్రసాద్ నటనపై ఆసక్తికర కామెంట్స్..

Pushpa: ఇట్స్ అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన మేకర్స్..