దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం లైగర్ (Liger). డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఇప్పటికే ఈ హీరోకు నార్త్‌లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్. గత కొద్ది రోజులుగా ఉత్తరాదిలోని పలు ప్రధాన నగరాల్లో లైగర్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అహ్మదాబాద్, పాట్నా ప్రాంతాల్లోని పలు మాల్స్‌లో నిర్వహించిన వేడుకలకు భారీగా అభిమానులు తరలివచ్చారు.
ఇక తాజాగా మహారాష్ట్రలోని పూణెలో పర్యటించింది లైగర్ టీమ్. విజయ్ దేవరకొండతోపాటు అనన్యకు..చిత్రయూనిట్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రౌడీ హీరోను చూసేందుకు భారీగా వచ్చారు ఫ్యాన్స్. ముఖ్యంగా ఈ వేడుకలకు అమ్మాయిలు ఎక్కువగా వచ్చి సందడి చేశారు. అరుపులు, ఈలలు వేస్తూ రచ్చ చేశారు. విజయ్, అనన్యను ఫోటోస్ తీసుకునేందుకు స్జేజ్ వద్దకు దూసుకోచ్చారు. ప్రస్తుతం పూణె టూర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇందులో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 25న హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ఇక ఈరోజు (ఆగస్ట్ 12న) సాయంత్రం 4 గంటలకు కోకా 2.0 సాంగ్ విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు.
#Liger stars @TheDeverakonda and @AnanyaPanday‘s visit to a Pune mall drew fans in hoards! #WATCH #VijayDeverakonda #AnanyaPanday pic.twitter.com/tvC44JrwjA
— HT City (@htcity) August 11, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.