
లెజెండ్ శరవణన్ ఈ పేరు ఇటీవల కాలంలో బాగానే వినిపిస్తోంది. శరవణన్ ప్రముఖ వ్యాపార వేత్త. శరవణన్ స్టోర్స్ కు ఎవరో ఒక స్టార్ ని బ్రాండ్ కు తానే ప్రచారకర్తగా చేస్తూ ఉంటారు ఈయన. స్థార్ హీరోయిన్స్ తో కలిసి శరవణన్ తన బ్రాండ్ కు ప్రమోషన్స్ చేసేవారు. ఇక ఇప్పుడు ఆయన ఏకంగా హీరో అవతారమెత్తాడు. శరవణన్ హీరోగా ది లెజెండ్(The Legend )అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్ లో శరవణన్ స్వీయ నిర్మాణంలో ”ది లెజెండ్” అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు జీడీ-జెర్రీ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కోసం పాపులర్ స్టార్స్ , టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు. ‘ది లెజెండ్’ చిత్రాన్ని జూలై 28న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా 2500 పైగా థియేటర్లలో మూవీ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. లెజెండ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఇక్కడ లైవ్ లో చూడండి.