తొలి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు ఆదికేశవ మూవీ చేస్తున్నారు. ఇందులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీలోని ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ.. ఎప్పటికప్పుడు మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ మెప్పించాయి. ఇటీవల ఈ సినిమాలోని మూడో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదికేశవ చిత్రంలోని మూడో సాంగ్ లీలమ్మో పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో శ్రీలీల, వైష్ణవ్ తేజ్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. మరోసారి తన ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో కట్టిపడేసింది శ్రీలీల.
ఈ పోటకు శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ చేయగా.. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. నకష్ అజీజ్, ఇంద్రావతి చౌహన్ ఆలపించారు. ఈ పాటలో శ్రీలీల, వైష్ణవ్ తేజ కల్సి చేసిన ఎనర్జీటిక్ మాస్ డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట దూసుకెళ్తుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల 10న రిలీజ్ కానుంది.
Unleashing the MASS BLAST with an Explosive ENERGY of #PanjaVaisshnavTej & @sreeleela14!💥#Leelammo song is out now! 🕺💃
A @gvprakash Musical 🥁🎵
🎤 @AzizNakash @IndravathiChauh
✍️ @LyricsShyam#Aadikeshava #JojuGeorge @aparnaDasss… pic.twitter.com/QCCAKjZCck— Sithara Entertainments (@SitharaEnts) October 25, 2023
ఇదిలా ఉంటే.. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తూ ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. కానీ ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఉప్పెన సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈహీరో.. ఆ తర్వాత మాత్రం సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. ఉప్పెన తర్వాత నటించిన చిత్రాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో ఇప్పుడు వైష్ణవ్ ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
MASS song of the year needs a MASS Celebration! 😎🕺#Aadikeshava 3rd single ~ #Leelammo Song Launch Event TODAY @ Park Hyatt – Hyd, from 3:00 PM onwards! 🤩💃
Promo – https://t.co/osH3dO4PdL
A @gvprakash Musical 🥁🎵
🎤 @AzizNakash @IndravathiChauh
✍️ @LyricsShyam… pic.twitter.com/cYwl9go0j9— Sithara Entertainments (@SitharaEnts) October 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.