Sridevi : శ్రీదేవి ఆస్తుల వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు.. అసలు ఏం జరిగిందంటే..

దివంగత హీరోయిన్ శ్రీదేవి ఫ్యామిలీ విషయాలు, ఆస్తుల వివాదం కొన్నాళ్లుగా వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఆ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న స్థలం గురించి దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది.

Sridevi : శ్రీదేవి ఆస్తుల వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు.. అసలు ఏం జరిగిందంటే..
Sridevi Family

Updated on: Sep 17, 2026 | 9:57 AM

దివంగత నటి శ్రీదేవికి చెందిన చెన్నైలోని ఆస్తికి సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఈ ఇష్యూ కాస్త సుప్రీంకోర్టుకు చేరింది. చెన్నై ఈస్ట్ కోస్టు రోడ్డులో ఉన్న స్థలంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణ వరకు అక్కడ స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. ఆస్తి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలను సూచించింది. 1988లో దివంగత నటి శ్రీదేవి కుటుంబానికి విక్రయించిన 2.7 ఎకరాల భూమిలో వాటా కోరుతూ ఒక మహిళ, ఆమె సోదరుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. శ్రీదేవి భర్త బోనీ కపూర్, వారి కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లపై ఆమె దాఖలు చేసిన దావాను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వును ఆ మహిళ సవాలు చేసింది. జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం, తదుపరి విచారణ జరిగే వరకు వివాదాస్పద ఆస్తిపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. సంబంధిత పక్షాలకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.

వివాదం విషయానికి వస్తే..

1988లో చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో 4.77 ఎకరాల స్థలాన్ని ముదలియార్ అనే వ్యక్తి కుటుంబం నుంచి శ్రీదేవి కొనుగోలు చేశారు. దశాబ్దాలుగా ఇది శ్రీదేవి కుటుంబం ఆధీనంలోనే ఉంది. శ్రీదేవి మరణానంతరం 2023లో ఆస్తి మార్పిడి కోసం దరఖాస్తు చేసుకోగా.. ముదలియార్ రెండో భార్య పిల్లలైన ఎం.సి.శివగామి, ఆమె సోదరుడు ఈ ఆస్తిలో తమకు వాటా ఉందంటూ చెంగల్పట్టు కోర్టులో సివిల్ కేసు వేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్ హైకోర్టును ఆశ్రయించారు. మొదటి భార్య ప్రాణాలతో ఉండగానే ముదలియార్ రెండో పెళ్లి చేసుకున్నారని.. కాబట్టి రెండో భార్య పిల్లలకు చట్టపరంగా వారసత్వ హక్కులు ఉండవని బోనీ కపూర్ తరపు న్యాయవాది వాదించారు. దీంతో హైకోర్డు శివగామి వేసిన సివిల్ కేసును కొట్టేవేసింది. దీంతో శివగామి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ కేసులో కపూర్ కుటుంబానికి నోటీసు పంపింది.

ఈ సందర్భంగా ఆస్తిని విక్రయించిన ఎం.సి. చంద్రశేఖరన్ కు అందులో ఐదవ వంతు వాటా ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్లు ఎం.సి. చంద్రశేఖరన్ పిల్లలు అనే వాదనకు సంబంధించి ఏదైనా వివాదం ఉందా అని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. కపూర్ కుటుంబం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, భూమికి సంబంధించిన అమ్మకం దస్తావేజు 1988 ఏప్రిల్ 19న అమలు చేయబడిందని వాదించారు. శ్రీదేవి మరణానంతరం, దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి లావాదేవీని సవాలు చేస్తూ 2023లో మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, తదనంతరం 2025లో దావా దాఖలు చేశారని ఆయన అన్నారు. సంబంధిత పిటిషనర్లు 1995 , 1999 సంవత్సరాలలో వయోజనులు అయ్యారని, అందువల్ల 2025లో దాఖలు చేసిన దావా కాలపరిమితి దాటిపోయిందని సింఘ్వి వాదించారు. ఐదవ వంతు వాటా మొదటి భార్యకు చెందుతుందని, ఇతర హక్కుదారులు తమ తమ వాటాలను మాత్రమే పొందగలరని సింఘ్వి సమర్పించారు.

వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశాలను అన్వేషించాలని సుప్రీంకోర్టు అన్ని పక్షాలను కోరింది. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమిస్తామని, మధ్యవర్తి ముందు హాజరై రాజీకి రావాలని ధర్మాసనం పక్షాలను కోరింది. మధ్యవర్తిత్వ పురోగతిని పరిశీలించడానికి ఈ విషయాన్ని ఇప్పుడు డిసెంబర్ 18వ తేదీకి వాయిదా వేశారు.

ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..

Loading...
Unable to load recommendations.
Follow Us