
తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసి తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు నటుడు శ్రీహరి. విలన్ గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత నటుడిగా మెప్పించారు. హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు నటుడు శ్రీహరి. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా రాణించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీహరి ఆ తర్వాత ఇతర హీరోల సినిమాల్లోనూ నటించారు. మగధీర, ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం తదితర సూపర్ హిట్ సినిమాల్లో శ్రీహరి పోషించిన పాత్రలకు మంచి పేరొచ్చింది. శ్రీహరి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి.
శ్రీహరి మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తూ నటించారు. తాజాగా శ్రీహరి ఓ స్టార్ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ నటించిన మగధీర, జంజీర్ సినిమాల్లో శ్రీహరి నటించారు. ఓ ఇంటర్వ్యూలో మగధీర సినిమా సమయంలో రామ్ చరణ్ నటన గురించి శ్రీహరి మాట్లాడుతూ..
రామ్ చరణ్ ఎంతో కష్టపడి, చాలా రిస్క్ తీసుకుని పోరాట సన్నివేశాల్లో నటించేవారని శ్రీహరి తెలిపారు. చరణ్ ఫైట్స్ చేస్తున్న ప్రతిసారీ తనకు బాగా భయం వేసేదని, అందుకే ఆయన ఉన్న ప్రతి షాట్ దగ్గరికి వెళ్లి రోప్‌లన్నింటినీ స్వయంగా టెస్ట్ చేసేవాడినని శ్రీహరి తెలిపారు. ఒక రోజు రామ్ చరణ్, “మీరెందుకు అంకుల్, వాళ్ళున్నారు కదా ఫైటర్స్ చూసుకుంటారు” అని అన్నాడట. దానికి శ్రీహరి బదులిస్తూ, “నాయనా, నేనున్నాను ఇక్కడ స్పాట్ లో.. ఫస్ట్ చిరంజీవి గారు, శ్రీహరి ఉన్నాడు కదా అక్కడ అంటారు” అని పేర్కొన్నారు. చిరంజీవి గారికి తనపై నమ్మకం ఎక్కువ అని, అందుకే తాను ఆ బాధ్యత తీసుకుని జాగ్రత్తలు చూసుకునేవాడినని శ్రీహరి తెలిపారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.