Puneeth Rajkumar: హీరో పునీత్ రాజ్ కుమార్ కూతురిని చూశారా.. ? గుడ్ న్యూస్ చెప్పిన ధృతి.. ఫోటోస్ వైరల్..

దివంగత కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూతురు ధృతి అమెరికాలో డిగ్రీ పూర్తి చేసుకుంది. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి గ్రాడ్యూయేషన్ పట్టా అందుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 2021లో ధృతి డిగ్రీ చదవడం స్టార్ట్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ధృతి పునీత్ రాజ్ కుమార్ ఫోటోస్ చూసి నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

Puneeth Rajkumar: హీరో పునీత్ రాజ్ కుమార్ కూతురిని చూశారా.. ? గుడ్ న్యూస్ చెప్పిన ధృతి.. ఫోటోస్ వైరల్..
Puneeth Rajkumar

Updated on: May 17, 2025 | 4:42 PM

కన్నడ స్టార్.. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ సూపర్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే సామాజిక సేవలోనూ ముందుండేవారు. కొన్నాళ్ల క్రితం పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా పునీత్ రాజ్ కుమార్ కూతురు ధృతి అమెరికాలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి పట్టా అందుకుంది. ధృతి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో అశ్విని పునీత్ రాజ్ కుమార్, వినయ్ రాజ్ కుమార్, వందిత పునీత్ రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

న్యూయార్క్ నగరంలోని ది న్యూ స్కూల్‌లో భాగమైన పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ 2022లో 5 సంవత్సరాల పాటు QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో యునైటెడ్ స్టేట్స్‌లో నంబర్ వన్ డిజైన్ స్కూల్‌గా గుర్తింపు పొందింది. 1896లో విలియం మెరిట్ చేజ్ స్థాపించిన ఈ పాఠశాల 1941లో ఫ్రాంక్ అల్వా పార్సన్స్‌గా పేరు మార్చబడింది. ఐదు విభాగాలలో మాస్టర్స్, బ్యాచిలర్, అసోసియేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది: ఆర్ట్, కమ్యూనికేషన్ డిజైన్, ఫోటోగ్రఫీ, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, డిజైన్ టెక్నిక్స్.

దీని ప్రధాన క్యాంపస్ న్యూయార్క్‌లోని గ్రీన్‌విచ్ విలేజ్‌లో ఉంది. 600-వర్క్‌స్పేస్ మేకింగ్ సెంటర్, 17 డ్రాయింగ్ స్టూడియోలు , 2,000 కళాఖండాల సేకరణను కలిగి ఉంది. పార్సన్స్ పారిస్ 1921లో స్థాపించబడింది. ఇదిలా ఉంటే.. పునీత్ రాజ్ కుమార్ కూతుర్లు సినిమా కార్యక్రమాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని PRK ప్రొడక్షన్, PRK ఆడియో సంస్థలను చూసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..