Kanchana : ప్రముఖ నటి దానం చేసిన స్థలంలో ఆలయం.. త్వరలోనే భూమి పూజ కార్యక్రమం..

ప్రముఖ నటి దానం చేసిన స్థలంలో త్వరలో ఆలయనిర్మాణం జరగనుంది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా ..అలనాటి అందాల తార కాంచన...

Kanchana : ప్రముఖ నటి దానం చేసిన స్థలంలో ఆలయం..  త్వరలోనే భూమి పూజ కార్యక్రమం..

Updated on: Feb 12, 2021 | 12:31 AM

Kanchana : ప్రముఖ నటి దానం చేసిన స్థలంలో త్వరలో ఆలయనిర్మాణం జరగనుంది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా .. అలనాటి అందాల తార కాంచన. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈనెల 13వ తేదీన పద్మావతి అమ్మవారి ఆలయానికి భూమి పూజ జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు శేఖర్‌ రెడ్డి తెలిపారు. చెన్నెలో గురువారం ఆయన మీడియాతో ఆలయ వివరాలు తెలిపారు.ఆ స్థలం విలువ ఇప్పుడు రూ.30 కోట్ల వరకు ఉంటుందని. కాంచన చెన్నెలోని టి.నగర్‌లో ఇచ్చిన స్థలంలోనే పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం చేపడుతామని తెలిపారు. ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొంటారని వివరించారు. నటి కాంచన బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో నటించారు చివరగా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ బామ్మగా కనిపించరు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Dharam Tej : వరుస సినిమాలను లైన్‌‌‌‌‌‌లో పెడుతున్న మెగాహీరో.. సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్‌‌‌‌‌‌తోనేనా..?