Laila: హీరోల్లో నా క్రష్ అంటే అతనే.. లైలా ఓపెన్ స్టేట్మెంట్

హీరోయిన్ లైలా తన సహనటుడు సూర్యతో ఉన్న బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మొదట "క్రష్" అని చెప్పినప్పటికీ, తరువాత తాము మంచి స్నేహితులమని, తమది విభిన్నమైన, అద్భుతమైన బంధమని స్పష్టం చేసింది. తెలుగులో సరైన స్క్రిప్ట్‌లు రావడం లేదని, తల్లి లేదా సోదరి పాత్రలు తనకు ఇష్టం లేదని కూడా తెలిపింది.

Laila: హీరోల్లో నా క్రష్ అంటే అతనే.. లైలా ఓపెన్ స్టేట్మెంట్
Laila

Updated on: May 07, 2026 | 2:09 PM

ప్రముఖ నటి లైలా గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సహనటుడు సూర్యతో ఉన్న బంధం, అలాగే తెలుగు సినిమా ప్రస్థానం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన కో-స్టార్‌పై క్రష్ ఉందా అని అడిగినప్పుడు, లైలా మొదట “సూర్య” అని పేరు చెప్పి, వెంటనే “జ్యోతిక నన్ను చంపేస్తుంది” అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. అనంతరం, “క్రష్ కాదు, కానీ అతను, నేను చాలా మంచి స్నేహితులం. మాది భిన్నమైన బంధం. మేము చాలా బాగా కలిసిపోతాం. కాబట్టి ఇది చాలా మంచి బంధం” అని లైలా స్పష్టం చేసింది. సూర్యతో తమది కేవలం స్నేహబంధం మాత్రమేనని తేలికపరిచింది.

తెలుగుతో పోలిస్తే తమిళంలోనే ఎక్కువ సినిమాలు ఎందుకు చేశారని అడిగినప్పుడు, లైలా “నేను చాలా తమిళ సినిమాలు చేశాను. తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నాను” అని తెలిపింది. అయితే, తనకు సరైన స్క్రిప్ట్‌లు రావడం లేదని పేర్కొంది. చాలా మంది తెలుగు దర్శకులు తల్లి పాత్రలు లేదా సోదరి పాత్రలు ఇవ్వాలని చూస్తున్నారని, అలాంటి పాత్రలు తనకు ఇష్టం లేదని వెల్లడించింది. ఆ దర్శకుల పేర్లు చెప్పడానికి నిరాకరించింది. లైలా ప్రకటనలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కాగా ఒకప్పుడు వరుస సినిమాలు చేసి తెలుగులో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకున్న లైలా.. 2004లో వచ్చిన శైలజా కృష్ణమూర్తి తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. అయితే ఆమె ఫ్యాన్ బేస్ మాత్రం ఇప్పటికీ అలానే ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us