
టాలీవుడ్ లో చాలా మంది లేడీ కమెడియన్స్ ఉన్న విషయం తెలిసిందే. తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆ లిస్ట్ లో గీతాసింగ్ ఒకరు. 2007లో వచ్చిన కితకితలు సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు గీత. ఆమె పలు కామెడీ క్యారెక్టర్స్ తో టాలీవుడ్ లో ఫెమస్ అయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 32 సినిమాల్లో నటించి మెప్పించారు గీత సింగ్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గీత ఆసక్తికర విషయం తెలిపారు. ఆమెను ఒక సినిమా షూటింగ్ లో ముంబై హీరోయిన్స్ అవమానించారని తెలిపింది.
గీత సింగ్ మాట్లాడుతూ.. అల్లరి నరేష్ నటించిన ఓ సినిమా షూటింగ్ సమయంలో నేను కారవాన్ లోకి ఎక్కాను. దాంతో అందులో ఉన్న ముంబై హీరోయిన్స్ నువ్వు ఎందుకు లోపలి వచ్చావ్ అని అన్నారు. అప్పుడు కొంచం ఫీల్ అయ్యాను. అయితే మా హెయిర్ డ్రస్సర్ అదేంటి మేడం మిమల్ని అలా అంటున్నారు అని అంది. నేను పోనీలే అని అన్నాను.
ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి వేరే ప్లేస్ లో కూర్చున్నా.. అయితే అల్లరి నరేష్ నన్ను పిలిచి ఆ హీరోయిన్స్ ముందు.. నా భుజం పై చేయివేసి.. ఈమె నా సినిమాలో హీరోయిన్ గా చేశారు . అలాగే ఆ సినిమా వల్లే నాకు మంచి బ్రేక్ వచ్చింది అన్నారు. దాంతో ఆ హీరోయిన్స్ షాక్ అయ్యారు. అలా నరేష్ గారు నన్ను అనడం చాలా ఆనందంగా అనిపించింది. అని తెలిపారు గీతాసింగ్.