Kurchi Thatha: కుర్చీ తాత చనిపోయారా? గాంధీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారంటూ ప్రచారం.. అసలు విషయమిదే

గత కొన్ని రోజులుగా కుర్చీ తాత ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ ఉలుకు పలుకు లేదు. దీంతో ఆయన చనిపోయాడని సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రచారం జరిగింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కుర్చీతాత తుదిశ్వాస విడిచారని నెట్టింట రూమర్లు వినిపించాయి. కానీ..

Kurchi Thatha: కుర్చీ తాత చనిపోయారా? గాంధీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారంటూ ప్రచారం.. అసలు విషయమిదే
Kurchi Thatha

Updated on: Dec 25, 2025 | 3:54 PM

‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్‌తో బాగా ఫేమస్ అయ్యారు హైదరాబాద్ లోని కృష్ణా నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ పదం వినియోగించారు. దీంతో అప్పటి నుంచి కాలా పాషా కాస్త కుర్చీ తాతగా మారిపోయాడు. పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యాడు. ఇక మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో ఓ పాట కోసం తమన్ ‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్ ను వాడుకున్నాడు. ఇందుకు గానూ కుర్చీ తాతకు డబ్బులు కూడా ఇచ్చాడు. దీంతో కుర్చీ తాత క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఈ మధ్యన ఈ పెద్దాయన పెద్దగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ సందడి చేయడం లేదు. ఇక నిన్నటి నుంచి అయితే కుర్చీ తాత చనిపోయారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. గాంధీ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచాడని రూమర్లు వినిపించాయి. దీంతో ఈ విషయం నిజమనుకుని చాలా మంది కుర్చీతాత RIP అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే ఇదంతా అబద్ధమని తేలింది.

ఈ ఫేక్ న్యూస్‌పై స్పందించిన ప్రముఖ యూట్యూబర్ వైజాగ్ సత్య, కుర్చీ తాత భార్యతో కలిసి వీడియో విడుదల చశాడు. ఈ సందర్భంగా ఆమె తన భర్త చనిపోలేదని, ప్రస్తుతం వరంగల్ లో ఉన్నాడని క్లారిటీ ఇచ్చింది . ఇదే వీడియోలో వైజాగ్ సత్య మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రిలో చనిపోయింది కుర్చీతాత కాదని, ఆయన ఎక్కడున్నా క్షేమంగానే ఉండి ఉంటాడని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కుర్చీతాత కుటుంబ సభ్యులతో మాట్లాడుతోన్న వైజాగ్ సత్య.. వీడియో..

అనంతరం కుర్చీ తాత స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. తాను చనిపోలేదని, ఇలాంటి తప్పుడు వార్తలతో నా కుటుంబాన్ని బాధ పెట్టోద్దని అభ్యర్థించారు. ‘నేను చనిపోలేదు, బతికే ఉన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు, మా కుటుంబాన్ని బాధపెట్టకండి. ఈ వార్త ఎవరైతే రాశారో వాళ్లు కనిపిస్తే కచ్చితంగా నేను చంపేస్తాను. నా మరణ వార్త విని నా భార్య కూడా కంగారుపడింది. బాగా ఏడ్చింది’ అని కుర్చీతాత ఆవేదన వ్యక్తం చేశారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి