
హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తూ ‘మీది మొత్తం 1000 అయింది. రెండు లివర్స్ ఎక్స్‌ట్రా’ అనే ఒక్క మాటతో సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది కుమారి ఆంటీ. అలా వచ్చిన క్రేజ్ తోనే టీవీ షోల్లో పార్టిసిపేట్ చేసిందామె. అలాగే సినిమా ప్రమోషన్లలోనూ కనిపించింది. ఇక ఇటీవల ఏకంగా నటిగానూ అరంగేట్రం చేసింది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘పాంచాలి పంచభర్తృక’ అనే సినిమాలో ఒక కీలక పాత్ర పోషించింది కుమారి ఆంటీ. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అలాగే టీవీ షోల్లోనూ సందడి చేస్తోంది. మరోవైపు తన రెగ్యులర్ ఫుడ్ బిజినెస్ చేసుకుంటూనే ఉంటోంది. ఇలా బిజి బిజీగా ఉంటోన్న కుమారి ఆంటీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన ఆదాయం, యాక్టింగ్ కెరీర్, బిగ్‌బాస్ ఆఫర్ తదితర విషయాల గురించి ఓపెన్ గా మాట్లాడింది.
‘నేను హైదరాబాద్ రాకముందు ఊళ్లో మెషిన్ కుట్టేదాన్ని.పొలం పనులు కూడా చేసేదాన్ని. ఆ రోజుల్లో రోజుకి కేవలం రూ.50 మాత్రమే ఇచ్చేవాళ్లు. కానీ ఇంతకన్నా గొప్పగా ఏదైనా చేయాలని నా భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చి 2011లో ఈ ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాను. నేను సోషల్ మీడియాలో ఫేమస్ కాక ముందే ఎక్కువగా సంపాదించేదాన్ని. ఎక్కువగా గిరాకీ చేసేదాన్ని. ‘మీది మొత్తం 1000 అయింది. రెండు లివర్స్ ఎక్స్‌ట్రా’ అనే డైలాగ్ వైరల్ అయిన తర్వాత మా హోటల్ పేరు మార్మోగిపోయింది. ఉన్నట్లుండి ఎక్కువమంది జనాలు వచ్చారు. దీంతో మరికొందరు నా షాపు దగ్గరకు రావటానికి భయపడ్డారు. ఫేమస్ కాకముందు నా హోటల్‌కి 1500 మంది వరకు వచ్చేవాళ్లు. ఇప్పుడు 1000 మంది వరకు వస్తున్నారు. రోజుకి రూ.20 వేల కౌంటర్ సేల్ అవుతోంది. అయితే దానికి తగ్గట్లే ఖర్చులు కూడా ఉంటాయి. ఆదాయం ఎంతుందో ఖర్చులు కూడా దానికి తగ్గట్లే ఉన్నాయి. యూట్యూబ్ వల్ల నా హోటల్ గురించి జనాలకు బాగా తెలిసింది. కానీ సెలబ్రిటీలు ఏడెనిమిదేళ్ల ముందే వచ్చేవారు. సుడిగాలి సుధీర్ సినిమా షూటింగ్ మా హోటల్‌లోనే జరిగింది. మేమున్న లోకేషన్ లో ఏ సినిమా షూటింగ్ జరిగినా మ దగ్గర నుంచే ఫుడ్ తీసుకెళ్లేవాళ్లు. ప్రస్తుతం నేను ఏడెనిమిది సినిమాల్లో నటిస్తున్నాను. అన్నీ చిన్న చిన్న పాత్రలే. గతేడాది నాకు బిగ్‌బాస్ షో నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కానీ అప్పుడు వెళ్లలేకపోయాను. ఈసారి అవకాశమొస్తే అస్సలు వదులుకోను’ అని కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి