AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuberaa: అదిరిపోయిన కుబేర ట్రైలర్.. ఇరగదీసిన నాగార్జున, ధనుష్, రష్మిక

‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్’, ‘లీడర్’, ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ సినిమాలతో టాలీవుడ్ లో ఫీల్ గుడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారే శేఖర్ కమ్ములు. ఇప్పుడు ఆయన తొలిసారిగా స్టార్ హీరోల సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా కుబేర.

Kuberaa: అదిరిపోయిన కుబేర ట్రైలర్.. ఇరగదీసిన నాగార్జున, ధనుష్, రష్మిక
Kubara
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2025 | 7:58 AM

Share

స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ స్టార్ హీరో. ధనుష్ చాలా వేగంగా సినిమాలు చేస్తుంటాడు. తెలుగు, తమిళ్, హిందీ బాషలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం తెలుగులో సినిమా చేస్తున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కుబేర అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా కుబేర సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. కుబేర సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డీఎస్పీ సంగీతంలో ధనుష్ తొలిసారిగా కుబేర చిత్రంలో ఓ పాట పాడడంతో అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. నటుడు ధనుష్ దర్శకత్వం వహించి, నటించి, ఈ సంవత్సరం విడుదలైన రాయన్ చిత్రం ప్రజల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా విజయం తర్వాత ధనుష్ నటిస్తున్న సినిమా కావడంతో కుబేర సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ ట్రైలర్ లో ధనుష్, రష్మిక తమ నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కింగ్ నాగార్జున మాత్రం కుమ్మేశారు. సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందని అర్ధమవుతుంది. ధనుష్ బిచ్చగాడిలా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఒక బిచ్చగాడు ఓ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే నేపథ్యం.. అతని కోసం విలన్స్ వెతకడం చాలా ఆసక్తిగా అనిపించింది. అలాగే ఓ ధనికుడు ప్రపంచాన్ని, ఓ పేదవాడి ప్రపంచాన్ని ఎలా కలిపారు అనేది చూడాలంటే కుబేర సినిమాకు వెళ్లాల్సిందే.. ఇక ఈ సినిమాను జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అందుకే శ్రీహరిని చివరి చూపు చూడలేకపోయాను..
అందుకే శ్రీహరిని చివరి చూపు చూడలేకపోయాను..
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం