పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఎప్పుడెప్పుడు డార్లింగ్ ను రాముడిలా.. సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామనకున్న ఫ్యాన్స్ అంచనాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరుకెక్కుతున్న సినిమా ఆదిపరుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ సెన్సార్ టెక్నాలిజీతో తెరకెక్కుతున్న ఈసినిమా.. టీజర్ రిలీజ్ నుంచే నెట్టింట విపరీతంగా బజ్ చేస్తోంది. ట్రోల్స్ రూపంలో.. తెగ వైరల్ అవుతూనే ఉంది. దాంతో పాటే.. సినిమాపై బజ్ కూడా త్రూ అవుట్ ఇండియా ఓ రేంజ్లో ఫామ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే న్యూస్ చెప్పి అంచనాలు పెంచేసింది హీరోయిన్ కృతి సనన్ .
సీత రోల్ తనకు కచ్చితంగా మంచి పేరును తెచ్చిపెడుతుందని చెప్పుకొచ్చింది కృతి సనన్. తనకు ఈ సినిమాతో మంచి పేరు ఖచ్చితంగా వస్తుందని నమ్మకం వ్యక్తం చేసింది. అయితే తాను రామానంద్ సాగర్ రామాయణాన్ని చూడలేదని కృతి పేర్కొన్నారు. ఆదిపురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల్లో రామాయణం గురించి అవగాహన పెరుగుతోందని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా సలార్. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ఆదిపురుష్ కంటే ముందే సాలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది.