Krithi Shetty: ఓయ్ క్యూటీ.. క్రేజీ బ్యూటీ.. ఒక్కసారే ఇన్ని సినిమాలా..? ఎలా అమ్మాయ్

|

Dec 01, 2022 | 12:02 PM

అబ్బా.. ఇలాంటి గర్ల్‌ఫ్రెండ్ ఉంటే చాలు అనుకుంటారు అబ్బాయిలు ఈ కుందనపు బొమ్మ కృతిని చూసి.. అబ్బా ఏం అందం అనక మారరు.

Krithi Shetty: ఓయ్ క్యూటీ.. క్రేజీ బ్యూటీ.. ఒక్కసారే ఇన్ని సినిమాలా..? ఎలా అమ్మాయ్
Krithi Shetty
Follow us on

ఫస్ట్ సినిమా రిలీజవ్వకముందే కుర్రకారు హృదయాలు దోచేసిన నటి కృతిశెట్టి. ఉప్పెన రిలీజ్ అవ్వకముందే ఆమెకు చాలా ఫిల్మ్ చాన్సులు వచ్చాయి. ఈ క్యూటీ అంటే అబ్బాయిలు పడి చచ్చిపోతారు. ప్రజంట్ కృతి కెరీర్ మంచి జోష్‌లో ముందుకు సాగుతుంది. ఊహించనన్ని అవకాశాలతో ఉక్కిరిబిక్కిరవుతుంది. తొలి సినిమా ఉప్పెన క్లిక్‌ కావడంతో బేబమ్మకు వరుస ఛాన్సులు తలుపుతడుతున్నాయి. తెలుగుతో పాటు పొరుగు భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు కృతి. ప్రస్తుతం వెంకట్‌ ప్రభు డైరక్షన్‌లో నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నారు కృతిశెట్టి. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్‌ డిసెంబర్‌ 3 నుంచి మొదలు కానుంది. ఈ గ్యాప్‌లో మలయాళ సినిమా అజయంటే రెండాం మోషనం సెట్స్ కి వెళ్లారు. టొవినో థామస్‌ నటిస్తున్న చిత్రమిది. పీరియాడిక్‌ చిత్రంగా తెరకెక్కుతోంది.

మరోవైపు బాల డైరక్షన్‌లో సూర్య నటిస్తున్న వనంగాన్‌లోనూ కృతిశెట్టి నాయికగా నటిస్తున్నారని కోలీవుడ్‌ సమాచారం. ఇందులో కృతిది కాస్త డీగ్లామర్‌ కేరక్టర్‌ అనే మాటలూ వినిపిస్తున్నాయి. కీర్తికి ఆల్రెడీ తెలుగు, కన్నడ మాట్లాడటం వచ్చు. ఇప్పుడు తమిళ్‌, మలయాళం కూడా నేర్చుకుంటున్నారు కృతి. అలా తన కెరీర్ ఎక్కవకాలం సాగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

సెట్స్‌లో సైతం నిర్మాతలను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా.. తలనొప్పులు లేకుండా.. మంచి ఫ్రెండ్లీ నేచర్‌తో ఉంటూ.. సౌందర్య, అనుష్క మాదిరి పేరు తెచ్చకుంటున్న కృతి.. ఇదే పద్దతి మెయింటైన్ చేస్తే.. పుష్కర కాలం సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లొచ్చని అంటున్నారు ఫిల్మ్ నగర్ వాసులు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..