Krithi Shetty: బంపర్ ఆఫర్ అందుకున్న బేబమ్మ.. తమిళ్ స్టార్ హీరో సరసన హీరోయిన్‏గా కృతి శెట్టి..

|

Jun 08, 2022 | 3:06 PM

ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ్ స్టార్ హీరో సూర్య.. డైరెక్టర్ బాలా కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ తర్వాత కోలీవుడ్ అరంగేట్రం చేస్తోంది కృతి శెట్టి.

Krithi Shetty: బంపర్ ఆఫర్ అందుకున్న బేబమ్మ.. తమిళ్ స్టార్ హీరో సరసన హీరోయిన్‏గా కృతి శెట్టి..
Krithi Shetty
Follow us on

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది కృతి శెట్టి (Krithi Shetty). మొదటి సినిమాతోనే ఆడియన్స్ మనసుకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత కృతిశెట్టికి వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం బేబమ్మ చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇప్పటికే టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీలో కథానాయికగా నటిస్తోంది. అలాగే యంగ్ హీరో నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం, రామ్ పోతినేనికి జోడిగా ది వారియర్ చిత్రాల్లో నటిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ దక్షిణాదిలో అగ్రకథానాయికలలోఒకరిగా దూసుకుపోతుంది. లేటేస్ట్ టాక్ ప్రకారం కృతి శెట్టి మరో బంపర్ ఆఫర్ అందుకుందట..

ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ్ స్టార్ హీరో సూర్య.. డైరెక్టర్ బాలా కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ తర్వాత కోలీవుడ్ అరంగేట్రం చేస్తోంది కృతి శెట్టి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమానే కాకుండా తాజాగా మరో స్టార్ హీరో సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసిందట కృతి శెట్టి. తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అరున్ మాధేశ్వరన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కోసం కథానాయికను ఎంపిక చేసే పనిలో ఉన్నారట మేకర్స్. గత కొద్ది రోజులుగా ఈ మూవీలో నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై రోజుకో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ధనుష్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటించనుందని టాక్ వినిపించింది. కానీ అనుహ్యంగా ప్రియాంక ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశం కృతికి వచ్చినట్టుగా సమాచారం. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు ధనుష్.. అరున్ మాధేశ్వరన్ కాంబోలో రాబోతున్న సినిమాలో కృతి శెట్టి కథానాయికగా ఎంపికైందని.. అందుకు బేబమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్.