Krishnam Raju death: “నాకు ఇది ఎప్పటికీ తీరని లోటు”.. కృష్ణంరాజు మృతి పట్ల ఎమోషనల్ అయినా మెగాస్టార్

రెబ‌ల్ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూశారు.. టాలీవుడ్ రారాజు అస్తమించారు.. సినీలోకాన్ని విషాదంలోకి నెట్టి ఓ బెబ్బులి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

Krishnam Raju death: నాకు ఇది ఎప్పటికీ తీరని లోటు.. కృష్ణంరాజు మృతి పట్ల ఎమోషనల్ అయినా మెగాస్టార్
Megastar

Updated on: Sep 11, 2022 | 12:31 PM

రెబ‌ల్ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూశారు.. టాలీవుడ్ రారాజు అస్తమించారు.. సినీలోకాన్ని విషాదంలోకి నెట్టి ఓ బెబ్బులి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. రెబ‌ల్ అభిమానుల్లో మాత్ర‌మే కాదు, యావ‌త్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు(Krishnam Raju) ఇక లేరు ఈ పదం వినడానికి కూడా ఎంతో బరువుగా అనిపిస్తోంది. రెబల్ స్టార్‌గా పాపుల‌ర్ అయిన కృష్ణం రాజు సొంత‌పేరు ఉప్ప‌ల‌పాటి వెంక‌ట కృష్ణంరాజు. తెలుగు సినిమా క‌థానాయ‌కుడిగా, నిర్మాత‌గా, రాజ‌కీయ‌వేత్త‌గా వెలుగు వెలిగిన కృష్ణంరాజు ఆదివారం తెల్ల‌వారు జామున తుదిశ్వాస విడిచారు. గ‌త కొన్నాళ్లుగా అనారోగ్య స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న ఆయ‌న ప్రైవేటు ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. విష‌యం తెలియ‌గానే ప్ర‌భాస్ హుటాహుటిన ఏఐజీకి చేరుకున్నారు. ఇక కృష్ణం రాజు మృతి పై సినిమా తారలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

మెగాస్టార్  చిరంజీవి స్పందిస్తూ.. శ్రీ కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం! మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారి తో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన ‘రెబల్ స్టార్’ కి నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రి గా కూడా ఎన్నో సేవలందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడి లాంటి ప్రభాస్ కీ, నా సంతాపం తెలియచేసుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు.

ఇవి కూడా చదవండి