పవన్​-క్రిష్ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్!​

|

Feb 11, 2020 | 7:36 PM

పవన్ కళ్యాణ్..ఈ పేరుకు ఎంత వైబ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాలా..?. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పవన్‌కు ఫ్యాన్స్‌ మాత్రమే కాదు ఎంతోమంది భక్తులు కూడా ఉన్నారు. పాలిటిక్స్‌లో బిజీ అయ్యి సినిమాలకు దూరమైన పవర్ స్టార్..మళ్లీ సినిమాలకు రీ ఎంట్రీ వరుస సినిమాలను కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం “పింక్” మూవీ షూటింగ్ వడివడిగా జరుగుతోంది. పవన్ ఈ మూవీ కోసం కేవలం 30 రోజులే డేట్స్ ఇచ్చారు. ఈ చిత్రానికి ‘వకీల్‌ సాబ్‌’ అనే టైటిల్ పరిశీలనలో […]

పవన్​-క్రిష్ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్!​
Follow us on

పవన్ కళ్యాణ్..ఈ పేరుకు ఎంత వైబ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాలా..?. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పవన్‌కు ఫ్యాన్స్‌ మాత్రమే కాదు ఎంతోమంది భక్తులు కూడా ఉన్నారు. పాలిటిక్స్‌లో బిజీ అయ్యి సినిమాలకు దూరమైన పవర్ స్టార్..మళ్లీ సినిమాలకు రీ ఎంట్రీ వరుస సినిమాలను కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం “పింక్” మూవీ షూటింగ్ వడివడిగా జరుగుతోంది. పవన్ ఈ మూవీ కోసం కేవలం 30 రోజులే డేట్స్ ఇచ్చారు. ఈ చిత్రానికి ‘వకీల్‌ సాబ్‌’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీతో పాటే క్రిష్‌తో చేస్తోన్న సినిమాను కూడా పట్టాలెక్కించాడు పవన్. ‘పింక్​’ రీమేక్​ వేసవి కానుకగా మే 15న రిలీజ్ చేయడానికి సన్నద్దం చేస్తుండగా..క్రిష్‌ మూవీని కూడా ఇదే ఏడాది విడుదల చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోన్నారు.

 మరోవైపు క్రిష్-పవన్‌ల మూవీ టైటిల్‌పై ఇంట్రెస్టెంట్ అప్డేట్ ఫిల్మ్ నగర్‌లో చెక్కర్లు కొడుతోంది. మొఘలాయిల కాలం నాటి కథాశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో..తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన  ‘విరు’ అనే దొంగ పాత్రలో నటిస్తున్నాడు పవన్. ఈ నేమ్‌ మీదగా టైటిల్ వచ్చేలా  ‘విరూపాక్షి’ అన్న టైటిల్‌ను ఫైనల్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రజంట్ ఈ మూవీ షూటింగ్‌లోనే పాల్గొంటున్నాడు పవర్ స్టార్. అందుకోసమే గడ్డం తీసేసి..జట్టు పెంచి, టాటూలతో కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు.