కొణిదెల ఫ్యామిలీ మీట్..వాట్ ఏ ‘సన్ డే’ బాస్

|

Jun 23, 2019 | 7:21 PM

హైదరాబాద్‌: మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరుకు టాలీవుడ్‌లో ఉన్న బ్రాండ్ గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. చిరు ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. వీరందరూ వారి వారి షూటింగ్స్‌లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎప్పుడో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే తప్ప అందరూ కలుసుకోడానికి వీలు పడదు. అందుకే ఫ్యామిలీ అంతా కలిసి ఈ సండేని ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.  అందరూ ఒక్కచోట చేరి విలువైన సమయాన్ని గడిపారు. రామ్‌ […]

కొణిదెల ఫ్యామిలీ మీట్..వాట్ ఏ సన్ డే బాస్
Follow us on

హైదరాబాద్‌: మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరుకు టాలీవుడ్‌లో ఉన్న బ్రాండ్ గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. చిరు ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. వీరందరూ వారి వారి షూటింగ్స్‌లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎప్పుడో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే తప్ప అందరూ కలుసుకోడానికి వీలు పడదు.

అందుకే ఫ్యామిలీ అంతా కలిసి ఈ సండేని ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.  అందరూ ఒక్కచోట చేరి విలువైన సమయాన్ని గడిపారు. రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌, నిహారిక, సాయిధరమ్‌ తేజ్‌, కల్యాణ్‌దేవ్‌, శ్రీజ, సుస్మిత తదితరులు కలిసి ఉన్న ఫొటోను చరణ్ సతీమణి ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. శ్రీజ, సాయిధరమ్‌, కల్యాణ్‌దేవ్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇదే ఫొటోలను పంచుకున్నారు. ‘అందమైన ఆదివారం’ అంటూ వర్షం, ఇల్లు, కుటుంబం, ప్రేమ అనే హ్యాష్‌ట్యాగ్‌లను సాయిధరమ్‌ జత చేశారు. మెగా కుటుంబం ఒక్కచోట ఉన్న ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. కొణిదెల ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే పిక్‌లో చూసి మెగా ఫ్యాన్స్ పరవశించిపోతున్నారు.