టాలీవుడ్ హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు నటిస్తున్న సినిమాకు ‘జిన్నా’ అనే టైటిల్ ఫైనల్ చేశారు. మొన్నీ మధ్యే ఈ టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ పేరే కాంట్రవర్సీకి కారణమైంది. జిన్నా టైటిల్‌పై తీవ్ర అభ్యంతరం చెబుతూ మంచు విష్ణుకు ట్వీట్ చేశారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. మహమ్మద్ ఆలీ జిన్నా దేశ విభజనకు కారకుడని, జిన్నా వల్ల హిందువులు మానప్రాణాలు కోల్పోయారన్నారు. దేశభక్తి కలవారు ఎవరూ జిన్నా టైటిల్‌ను హర్షించరని పేర్కొన్నారు. ఇంతకీ జిన్నా అనే ఈ టైటిట్ వెనుక వున్న కథేంటి? తమ సినిమా టైటిల్‌కి, మహమ్మద్ ఆలీ జిన్నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు రైటర్ కోన వెంకట్.
ఇది G.నాగేశ్వరరావు అనే తిరుపతిలో పెరిగిన కుర్రాడి కథ. G.నాగేశ్వరరావు అనే పేరు నచ్చక దాని షార్ట్ ఫాం జిన్నాగా మార్చుకుంటాడు. అదే టైటిల్‌గా పెట్టామని కోన వెంకట్ చెబుతున్నారు. అయితే జిన్నా అనగానే గుర్తుకొచ్చేది మహమ్మద్ ఆలీ జిన్నాయే. అది విష్ణు, కోన డిస్కషన్‌లోనే తెలుస్తోంది. జిన్నా అనే టైటిల్ పెట్టడం మొదటి తప్పయితే, టైటిల్‌ను తిరుమల కొండలపై ఉంచడం రెండో తప్పు అంటున్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్. ఈ రెండిటినీ ఉపసహంరించాలంటున్నారు ఆయన. ఈ ఇష్యూపై ప్రొడ్యూసర్‌తో మాట్లాడతానని చెప్పారు కోన వెంకట్. జిన్నా టైటిల్‌కు అలియాస్ జి.నాగేశ్వరరావు అని యాడ్ చేస్తామని చెబుతున్నారు కోన. ఈ కాంట్రవర్సీ ఎలా సెటిల్ అవుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి