
తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీమన్. వందలాది తమిళ సినిమాల్లో నటించినప్పటికీ, ఆయన పక్కా తెలుగువాడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, మామిడాడ గ్రామానికి చెందిన శ్రీమన్.. సొంత మాతృభాష అయిన తెలుగులో సరైన గుర్తింపు రాలేదనే బాధతో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన ఆవేదనను గుర్తించి, టాలీవుడ్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా పెద్ద బ్రేక్ ఇచ్చారు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. గతంలో హైదరాబాద్‌లో విజయ్ ‘వారిసు’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో, నిర్మాత దిల్ రాజు ద్వారా అనిల్ రావిపూడితో శ్రీమన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే శ్రీమన్ తన మాతృభాషలో నటించాలనే కోరికను దర్శకుడికి తెలియజేశారు. శ్రీమన్ ప్రతిభను గుర్తించిన అనిల్ రావిపూడి, ప్రస్తుతం వెంకటేష్ , కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రంలో ఆయనకు ఒక అద్భుతమైన, కీలకమైన పాత్రను అందించారు
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..
ఈ తెలుగు సినిమా అవకాశం కోసం శ్రీమన్ తమిళంలో అప్పటికే ఒప్పుకున్న నాలుగు పెద్ద సినిమాలను కూడా వదులుకోవడం విశేషం. సొంత భాషలో నటించడం కోసం ఆయన చేసిన ఈ త్యాగాన్ని తమిళ దర్శకులు, ఆయన స్నేహితులు కూడా ఎంతగానో అభినందించారు. ఇప్పటికే వారం రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న శ్రీమన్, ఈ సినిమా సెట్స్‌లో ఉన్న ఎనర్జీ , కామెడీ టైమింగ్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు.
ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..
“అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు” అనే సామెతను గుర్తుచేస్తూ, అనిల్ రావిపూడి సినిమాతో తెలుగులో తనకున్న పెద్ద వెలితి తీరిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు రెండు మూడేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో డైలాగులు చెప్పడం తనకు ఎనలేని ఆనందాన్ని ఇస్తోందని శ్రీమన్ పేర్కొన్నారు. పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు శ్రీమన్ మరింత దగ్గరవ్వాలని, టాలీవుడ్‌లో ఆయనకు మరిన్ని మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం.
ఎక్కువ మంది చదివినవి : Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..
🙏 to god
Thanks to Anil Garu
Never expected a straight film in Telugu,One week shoot completed, just pinched myself for the confirmation that I’m working in my mother tongue,set is with positive energy,comedy rollercoaster, omg full fun blessed to work with this Amazing team pic.twitter.com/fCUlkVAUPQ— actor sriman (@ActorSriman) July 3, 2026
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..