Jayam Ravi: మరోసారి పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన స్టార్ హీరో.. ఏమన్నారంటే..

|

Oct 13, 2024 | 4:19 PM

రవి తన సోదరుడు రాజా దర్శకత్వం వహించిన 'జయం' చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాతో తనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఆయనను అభిమానులు జయం రవి అని పిలవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మూవీ తర్వాత జయం రవి పేరు సినీరంగంలో మారుమోగింది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.

Jayam Ravi: మరోసారి పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన స్టార్ హీరో.. ఏమన్నారంటే..
Jayam Ravi
Follow us on

కొన్నిరోజులుగా కోలీవుడ్ హీరో జయం రవి పర్సనల్ లైఫ్ గురించి ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరో.. మరోవైపు వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధం విషయంలో మాత్రం సతమతమవుతున్నారు. తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి జయం రవి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రవి తన సోదరుడు రాజా దర్శకత్వం వహించిన ‘జయం’ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాతో తనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఆయనను అభిమానులు జయం రవి అని పిలవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మూవీ తర్వాత జయం రవి పేరు సినీరంగంలో మారుమోగింది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టి 21 ఏళ్లు. అతడి మొదటి చిత్రం జయం 2003లో విడుదలైంది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు మొత్తం 32 చిత్రాల్లో నటించి అలరించాడు. తన మొదటి సినిమా నుండే తన నటన, డ్యాన్స్, ఫైట్‌లతో ప్రశంసలు అందుకుంటున్నాడు. అతని తదుపరి చిత్రం బ్రదర్. ఈ చిత్రం దీపావళి 31న విడుదల కానుంది. 2009లో ఆర్తిని పెళ్లి చేసుకున్న జయం రవికి ప్రస్తుతం ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ తమ 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు జయం రవి. దీంతో అటు అభిమానులు, ఇటు సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. ఆర్తి విడుదల చేసిన ఒక ప్రకటనలో, వివాహం నుండి వైదొలగడం తన స్వంత నిర్ణయమని, కుటుంబ ప్రయోజనాల కోసం కాదని పేర్కొన్నాడు. ఈ ఇద్దరి ప్రకటన తర్వాత, జయం రవి, అతని చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఇంటర్నెట్‌లో చాలా పుకార్లు వ్యాపించాయి. అలాగే, నటుడు జయం రవి, గాయని కెనిషా ఫ్రాన్సిస్ ప్రేమలో ఉన్నారని.. ఆమె కారణంగా వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని ఇంటర్నెట్‌లో పుకార్లు వ్యాపించాయి.

తన జీవితం గురించి వినిపిస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని..తన విషయంలో ఒక స్త్రీని ఇన్వాల్వ్ చేయడం అనవసరమని.. ఆ విషయం గురించి ఎక్కువగా మాట్లాడాలని లేదని.. కోర్టు ద్వారా నిజానిజాలు ఏదో ఒకరోజు బయటకు వస్తాయని గతంలో జయం రవి అన్నారు. తాజాగా బ్రదర్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న జయం రవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ”బ్రదర్ సినిమా నా వ్యక్తిగత జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సినిమాలోని సన్నివేశాలు నా జీవితంలో జరిగిన అనేక విషయాలను ప్రతిబింబించేలా ఉన్నాయి. తన బాధను లేఖలో రాయడం మా చెల్లికి చిన్నప్పటి నుంచి అలవాటు. ఇది చదివితే నేను తప్పు చేశానని అనిపిస్తుంది. నా సినీ కెరీర్‌పై ఇతరులు చెప్పేది విని దాని ప్రకారం నడుచుకుంటాను. అయితే నా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడాలని అనుకోను’’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.