Sridevi: శ్రీదేవి నోటిలో బంగారు ముక్క ఉంచి అంతిమ సంస్కారాలు.. ఎందుకో తెలుసా?

అలనాటి అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి సుమారు ఏడేళ్లకు పైగానే అవుతోంది. అయినా తన సినిమాల రూపంలో ఇప్పటికీ సినీ ప్రేక్షకులు, అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంది. కాగా శ్రీదేవి అంతిమ సంస్కారాల సమయంలో..

Sridevi: శ్రీదేవి నోటిలో బంగారు ముక్క ఉంచి అంతిమ సంస్కారాలు.. ఎందుకో తెలుసా?
Actress Sridevi

Updated on: May 27, 2025 | 6:48 PM

భారతీయ సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవిది ప్రత్యేకమైన స్థానం. తన అందం,అభినయంతో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుందీ అందాల తార. అయితే, ఈ లెజెండరీ నటి ఇప్పుడు మనతో లేరు. శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి దాదాపు ఏడు సంవత్సరాలవుతోంది. శ్రీదేవి ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అభిమానులైతే కన్నీరుమున్నీరయ్యారు. ఇక ఆమె అంత్యక్రియలకైతే లక్షలాది మంది గుమిగూడారు. హిందూ సంప్రదాయ ప్రకారం శ్రీదేవి అంత్యక్రియలు అధికారికంగా జరిగాయి. కాగా అంతిమ సంస్కారాల సమయంలో శ్రీదేవి వధువులా అలంకరించారు. అలాగే ఆమె నోటిలో బంగారు ముక్క పెట్టారు. దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది

శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులోని మీనంపట్టిలో జన్మించారు. 54 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. శ్రీదేవికి వీడ్కోలు పలికేటప్పుడు, ఆమె కుటుంబం ఆమె నోట్లో ఒక బంగారు ముక్కను ఉంచింది. తమిళ హిందూ సంప్రదాయం ప్రకారం మరణించిన వారి నోటిలో కొంత బంగారాన్ని పెట్టి సాగనంపడం ఆనవాయితీగా వస్తోది. ఇందులో భాగంగానే వారు వాడిన ఉంగరాలు, దిద్దులు పెట్టి తమకు అయిన వారిని స్మశానానికి సాగనంపుతారు. ఇలా చేస్తే మరణించిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందట. ఇప్పటికీ చాలా చోట్ల ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీదేవి అంతిమ సంస్కారాల సమయంలో ఆమె కుటుంబ సభ్యులు నటి నోటిలో ఒక బంగారు ముక్క ఉంచి సాగనంపారు.

ఇవి కూడా చదవండి

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

ఇద్దరు కూతుళ్లు ఇండస్ట్రీలోనే..

శ్రీదేవి వారసురాలిగా ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. ‘ధడక్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. శ్రీదేవి ఫిబ్రవరి 2018లో మరణించగా, జాన్వీ తొలి చిత్రం ‘ధడక్’ జూలై 2018లో విడుదలైంది. దీని తర్వాత జాన్వీ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ‘ది ఆర్చీస్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందీ అందాల తార.

ట్రెడిషినల్ లుక్ లో జూనియర్ శ్రీదేవి..

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .