వేసవి కాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. గత రెండు మూడు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న జనాలకు ఆన్ లిమిటెడ్ కామెడీ ఎంటర్టైనర్ కూల్ చేశాడు సిద్ధూ జొన్నలగడ్డ. గతంలో డీజే టిల్లు సినిమాతో థియేటర్లలో కడుపుబ్బా నవ్వించిన సిద్ధూ.. ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీతో మరోసారి మ్యాజిక్ చేశాడు. డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 29న గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. అడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ దగ్గర హడావిడి చేస్తుంది టిల్లు స్క్వేర్. తొలి రోజు తెల్లవారుజామున నుంచి థియేటర్లలో టిల్లు గాడి సందడి మొదలైంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. అటు యూఎస్‌లోనూ టిల్లు స్క్వేర్ సత్తా చాటుతుంది.
మొదటి రోజే రూ.25 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది అంటే మాములు విషయం కాదు. అత్యధిక వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ఈ సినిమాకు ఈ ఆదివారం మరింత కలెక్షన్స్ పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా అందులోని డైలాగ్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. డీజే టిల్లుతో జనాలను మెప్పించిన సిద్ధూ జొన్నలగడ్డ.. ఇప్పుడు టిల్లు స్వ్కేర్ సినిమాతో మరోసారి రచయితగానూ సత్తా చాటాడు.
అయితే బాక్సాఫీస్ వద్ద టిల్లు డైలాగ్ మ్యాజిక్కు కేరాఫ్ అడ్రస్ సిద్ధూ మాత్రమే కాదు.. మరొకరు ఉన్నారు. టిల్లు పాత్రను ఇంత బాగా తీర్చిదిద్దడంతోపాటు.. యూత్‌ను అలరించే ట్రెండీ డైలాగ్స్ రాయడంలోనూ అతడికి సాయం చేసింద రవి ఆంటోనీ. ఈ పేరు చెబితే జనాలు అంతగా గుర్తుపట్టలేరు..కానీ మ్యాడ్ మూవీ రైటర్ కమ్ యాక్టర్ అంటే ఠక్కున గుర్తుపటేస్తారు. ఈ సినిమాలో ఆంటోనీ అనే పాత్రలో నటించిన నటుడే రవి ఆంటోనీ. వీరిద్దరు డీజే టిల్లు స్క్రిప్ట్ రాశారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లల్లోనే వీరిద్దరు స్నేహితులు. టిల్లు స్క్వేర్ లో సిద్దూ, రవి జోడీ పంచులు పేల్చింది. ఇక ఇప్పుడు ఇద్దరు కలిసి టిల్లు స్క్వేర్ 3 తెరకెక్కించనున్నారు. దీంతో పార్ట్ 3పై మరింత అంచనాలు పెరిగాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.