Trending Song: 26 ఏళ్లుగా యూట్యూబ్‏లో ట్రెండింగ్ ఈ సాంగ్.. ఇప్పటికీ తెగ వింటున్న యూత్..

దాదాపు 26 సంవత్సరాలుగా ఓ సాంగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రంలోని పాట ఇప్పటికీ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. భాషతో సంబంధం లేకుండా అందరిని అలరిస్తుంది. ముఖ్యంగా మెలోడీ సాంగ్స్ ఇష్టపడేవారికి ఈ పాట ఫెవరేట్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ సాంగ్ మరోసారి అడియన్స్ హృదయాలను గెలుచుకుంటుంది.

Trending Song: 26 ఏళ్లుగా యూట్యూబ్‏లో ట్రెండింగ్ ఈ సాంగ్.. ఇప్పటికీ తెగ వింటున్న యూత్..
Trending Song

Updated on: Jan 26, 2026 | 10:11 PM

1998లో షారుఖ్ ఖాన్, మనీషా కొయిరాలా నటించిన ‘దిల్ సే’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉండేది. ఈ చిత్రంలోని పాటలన్నీ భారీ విజయాన్ని సాధించాయి. అయితే ఈ మూవీలో హీరోయిన్ ప్రీతి జింటా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ ఇప్పటికీ అడియన్స్ హృదయాలను గెలుచుకుంటుంది. ఈ చిత్రం తమిళంలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. అదెనండీ.. తమిళంలో నెంజినిలే నెంజినిలే సాంగ్. హిందీలో ఇదే సాంగ్ జియా జలే. చాలా సంవత్సరాలుగా ఈ సినిమాలో సాంగ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..

ఈ పాటలోని బాణీలు, సాహిత్యం ప్రజల మనస్సులను గెలుచుకుంది. 1998లో దిల్ సే సినిమాలో గుల్జార్ రాసిన ఈ సాంగ్ వధువు భావాలను తెలియజేయడానికి రాశారు. ఈ పాటలోని ప్రతి లైన్ అనేక భావోద్వేగాలను తెలియజేస్తుంది. ఈ పాట సాహిత్యం మాత్రమే కాదు. దీని సంగీతాన్ని కూడా అభిమానులు ఉన్నారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ చాలా మంది ఇష్టమైన మూవీ. ఈ సినిమాలో జియా జలే సాంగ్ ను మరింత అందంగా తెరకెక్కించారు. A.R. రెహమాన్ స్వరపరిచిన ఈ పాటకు గుల్జార్ సాహిత్యం అందించారు.

ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..

ప్రీతి జింటా ఈ సినిమాతో తన అరంగేట్రం చేసింది. ఈ సినిమాలోని ఒక పాట ఇప్పటికీ అభిమానుల నంబర్ వన్ ఎంపిక. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషలలో ప్రీతి జింటా వరుస అవకాశాలు అందుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..