Balakrishna : ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేశారు.. రికార్డ్ క్రియేట్ చేసిన బాలకృష్ణ.. ఏ సినిమా అంటే..

టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. దాదాపు 50 ఏళ్ల సినీప్రస్థానంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కథల ఎంపిక విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కథ నచ్చితే.. దర్శకుడిపై నమ్మకంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు.

Balakrishna : ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేశారు.. రికార్డ్ క్రియేట్ చేసిన బాలకృష్ణ.. ఏ సినిమా అంటే..
Balakrishna

Updated on: Dec 20, 2025 | 10:46 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి చెప్పక్కర్లేదు. కథల ఎంపికలో ఆయన తీసుకునే జాగ్రత్తల గురించి తెలిసిందే. కథ నచ్చితే ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీగా ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. అయితే బాలయ్య కెరీర్ లో ఓ సినిమా మాత్రం చాలా ప్రత్యేకం. 1984లో వచ్చిన ఆ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. అప్పట్లో ఆ సినిమాను దాదాపు ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేశారట. మెగాస్టార్ చిరంజీవి, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజుతోపాటు మరికొందరు హీరోలు సైతం ఈ స్టోరీని వదులుకున్నారట. మొత్తం ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేసినా బాలయ్య మాత్రం కథ నచ్చడంతో ఆ సినిమాలో నటించి విజయాన్ని అందుకున్నారు.

ఇవి కూడా చదవండి : Actress : మూడు సినిమాలతోనే ఇండస్ట్రీనికి షేక్ చేసింది.. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. కానీ ప్రియుడి మోసంతో..

డైరెక్టర్ కె. మురళీమోహనరావు దర్శకత్వం వహించిన ఆ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ మలుపు తిప్పింది. అదే కథానాయకుడు. ఈ మూవీ బాలయ్య కెరీర్ లోనే మెమరబుల్ మూవీగా నిలిచింది. 1984లో విడుదలైన ఈ మూవీలో బాలయ్య జోడిగా విజయశాంతి నటించారు. అలాగే అల్లు రామలింగయ్య, చంద్రమోహన్, సీనియర్ నటి శారద కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : బయట చూశాం.. వాళ్ల చరిత్ర మాకు తెలుసు.. తనూజ గురించి శ్రీసత్య, యష్మీ సంచలన కామెంట్స్..

ఇదెలా ఉంటే.. ఇటీవలే అఖండ 2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బాలయ్య. డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 12న విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీకి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇవి కూడా చదవండి : Actress : స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై.. ఇప్పుడు 400 కోట్ల ఇంట్లో ఆ హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Cinema: వార్నీ.. ఈ క్రేజీ హీరోయిన్ ఈ విలన్ భార్యానా.. ? తెలుగులో స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు..