Cinema : హీరో కోసం 80 కోట్లు ఖర్చు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్..

ప్రతి సినిమాకు కథతోపాటు హీరో సైతం ప్రధానమే. డైరెక్షన్, హీరోహీరోయిన్ ఎంపిక, కథ ఇందులో ఏదీ మిస్సైన బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేవు. 2025 లో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ, ఓటీటీలో సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ సైతం ఆ జాబితాలోకి చెందినదే.

Cinema : హీరో కోసం 80 కోట్లు ఖర్చు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్..
Bhaaghi 4

Updated on: Nov 11, 2025 | 10:15 PM

హీరో, హీరోయిన్, విలన్ కథ కోసం నిర్మాతలు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ సినిమాను జోరుగా ప్రమోట్ చేశారు. కానీ విడుదలైన తర్వాత, నిర్మాతలు ఆశించినంతగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత అట్టర్ ప్లాప్ అయ్యింది. మనం మాట్లాడుతున్న సినిమా పేరు “బాఘి 4.” 2025 లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాలలో ఒకటి. ఈ యాక్షన్-థ్రిల్లర్‌లో కొంత ఉత్కంఠభరితమైన టచ్ ఉంది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇందులో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే శ్రేయాస్ తల్పాడే, సౌరభ్ సచ్‌దేవా, సోనమ్ బజ్వా కీలకపాత్రలు పోషించారు.

ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన హర్నాజ్ సంధు నటించారు. అలాగే సంజయ్ దత్ విలన్ గా నటించారు. భారీ అంచనాల మధ్య నిర్మించినప్పటికీ ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ కథ నేవీ ఆఫీసర్ రోనీ (టైగర్ ష్రాఫ్) చుట్టూ తిరుగుతుంది. అతను కారు ప్రమాదం తర్వాత కోమాలోకి వెళ్లి.. ఏడు నెలల తర్వాత అతను కోలుకుంటాడు. ఆ తర్వాత తన స్నేహితురాలు అలీషా (హర్నాజ్ సంధు) తప్ప మరేమీ గుర్తుకు రాదు. అతను ఆమె కోసం వెతుకుడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి..? అలీషా ? ఏమైందీ అనేది కథ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది.

ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. “బాఘి 4” దేశవ్యాప్తంగా మూడవ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. రిషబ్ శెట్టి “కాంతారా: చాప్టర్ 1” మొదటి స్థానంలో, “మిత్ర మండల్” రెండవ స్థానంలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

Follow Us