
కంటెంట్ బాగుంటే చాలు స్టార్స్ అక్కర్లేదని నిరూపిస్తున్నాయి చిన్న సినిమాలు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ సినిమాల కంటే చిన్న చిత్రాలే దూసుకుపోతున్నాయి. ఇప్పుడు తెలుగులో రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. స్టార్స్ లేకపోయినా.. పెద్ద డైరెక్టర్ కాకపోయినా ఈ సినిమా మాత్రం థియేటర్లలో సత్తా చాటుతుంది. అయితే ఈ సినిమా మాదిరిగానే మరో మూవీ సైతం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. చిన్న సినిమా.. కానీ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. కేవలం రూ.50 లక్షలతో తెరకెక్కించిన ఈ మూవీ.. ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. దాదాపు 50 రోజులుగా థియేటర్లలో ప్రదర్శితమవుతుంది. ఆ సినిమా పేరు లాలో. గుజరాతీ భాషలో తెరకెక్కించిన సినిమా ఇది.
ఇవి కూడా చదవండి : Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..
అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీవా రచ్, శృహద్ గోస్వామి, కరణ్ జోషిలు ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబర్ 10న చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వస్తుంది. దీంతో రోజు రోజుకు ఈమూవీ కలెక్షన్స్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. విడుదలైన మూడవ వారం నుంచి ఈ సినిమా పేరు మారుమోగుతుంది. ఇప్పుడు ఈ సినిమాకు భారీగా వసూల్లు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..
కథ విషయానికి వస్తే.. అహంకారం, తప్పుల కారణంగా కష్టాల్లో కూరుకుపోయిన లాలో అలియాస్ కరణ్ జోషి అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. తన భార్య తులసి అలియాస్ రీవా రచ్ తో గొడవపడడం.. ఆ తర్వాత అనుహ్యంగా ఒక ఇంట్లో చిక్కుకుపోతాడు. ఆ ఒంటరితనంలో గతంలో తాను తన భార్యతో ప్రవర్తించిన తీరును గుర్తుచేసుకుని కుమిలిపోతుంటాడు. అప్పుడే సాక్షాత్తూ శ్రీకృష్ణుడి అలియాస్ శ్రుహద్ గోస్వామి రూపంలో దేవుడే అతనికి ఆశాదీపంగా కనిపిస్తాడు. ఆ తర్వాత లాలో ఎలా బయటకు వచ్చాడు అనేది సినిమా.
ఇవి కూడా చదవండి : Actress : అతడిని నమ్మి ఆ సీన్స్ చేశాను.. కానీ షూట్‌లో.. హీరోయిన్ కామెంట్స్..
ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?