8 కోట్ల సినిమా.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. కానీ ఇద్దరు హీరోలు, హీరోయిన్ చనిపోయారు..

సాధారణంగా ఇప్పుడు తక్కువ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మూవీస్.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నాయి. అలాగే గతంలోనూ కొన్ని చిన్న చిత్రాలు థియేటర్లలో దూసుకుపోయాయి. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ? ఇప్పటికీ ఆల్ టైమ్ హిట్ లవ్ స్టోరీ అది.

8 కోట్ల సినిమా.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. కానీ ఇద్దరు హీరోలు, హీరోయిన్ చనిపోయారు..
Chandini Movie

Updated on: Aug 12, 2025 | 6:44 PM

ఒకప్పుడు కొన్ని సినిమాలను థియేటర్లలో 150 రోజులకు పైగా ప్రదర్శించారు. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు సంచలన విజయాన్ని సాధించాయి. అంతేకాదు… అప్పట్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఎవర్ గ్రీన్ హిట్ మూవీ. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ మూవీ గురించి మీకు తెలుసా.. ? స్టార్ హీరోహీరోయిన్స్ కలిసి నటించిన ఈ చిత్రానికి అడియన్స్ బ్రహ్మారథం పట్టారు. అప్పట్లోనే జనాల హృదయాలు దొచుకున్న సినిమా ఇది. కానీ ఇందులో నటించిన హీరోహీరోయిన్స్ ఇప్పుడు బతికి లేరు. ఆ సినిమా పేరు చాందిని. బాలీవుడ్ ఆల్ టైమ్ హిట్ లవ్ స్టోరీ. 1989లో డైరెక్టర్ యష్ చోప్రా తెరకెక్కించిన అందమైన ప్రేమకథ ఇది.

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

ఇందులో రిషి కపూర్, శ్రీదేవి, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో నటించారు. చాందిని సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలోని సాంగ్స్, శ్రీదేవి డ్రెస్సింగ్, యాక్టింగ్ జనాలకు తెగ నచ్చేశాయి. దీంతో అప్పట్లో ఈ మూవీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇద్దరు హీరోస్ ఒకే అందమైన అమ్మాయిని ప్రేమించడం.. ఆ తర్వాత ముగ్గురి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయనేది సినిమా. కేవలం 8 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో రూ.27 కోట్లకు పైగా వసూల్లు రాబ్టటి రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించిన వినోద్ ఖన్నా, రిషి కపూర్, శ్రీదేవి అందరూ కేవలం నాలుగేళ్ల గ్యాప్ లో చనిపోయారు. మొదట 2017 ఏప్రిల్ 27న వినోద్ ఖన్నా బ్లాడర్ క్యాన్సర్ తో పోరాడి చనిపోయారు. ఆ తర్వాత 2018లో శ్రీదేవి అనుహ్యంగా బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. 2020లో రిషి కపూర్ క్యాన్సర్ చనిపోయారు.

ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..