Tollywood : 11 మందితో డేటింగ్.. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లల తల్లి.. ఇప్పటికీ ఒంటరిగానే..

సినీతారల పర్సనల్ విషయాల గురించి నిత్యం ఏదోక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ లవ్, బ్రేకప్ విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ పేరు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.

Tollywood : 11 మందితో డేటింగ్.. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లల తల్లి.. ఇప్పటికీ ఒంటరిగానే..
Sushmitha Sen

Updated on: Dec 28, 2025 | 6:57 AM

బాలీవుడ్ బ్యూటీ సుష్మితా సేన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. హిందీలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. సుష్మిత తెలుగు చిత్రం రక్షకుడులో నాగార్జున సరసన నటించి దక్షిణాది సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఆమె పేరు నిత్యం వార్తలలో నిలిచేది. అప్పట్లో ఆమె స్టార్ హీరోలతో ప్రేమాయణం కొనసాగించిందని ప్రచారం నడిచింది. సుష్మిత లలిత్ మోడీ, సంజయ్ నారంగ్, రణదీప్ హుడా, ఇంతియాజ్ ఖత్రి, వసీం అక్రమ్ మరియు ముదస్సర్ అజీజ్ సహా 11 మందితో ప్రేమలో పడిందని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఆమె ఇటీవల రోహ్మాన్ షాల్ తో కలిసి కనిపించింది.

ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

‘మిస్ యూనివర్స్’ టైటిల్ గెలుచుకున్న నటి సుస్మితా సేన్, ‘తాలి’ , ‘ఆర్య 3’ వెబ్ సిరీస్‌లతో మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంది. సుష్మిత ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. కానీ ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి. 24 సంవత్సరాల వయసులో, సుష్మితా సేన్ ఒక చిన్న అమ్మాయిని దత్తత తీసుకుంది. రీనా అనే 6 నెలల పాపను దత్తత తీసుకుంది.

ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..

2001లో, సుష్మితా సేన్ అక్షయ్ కుమార్, కరీనా కపూర్ నటించిన ‘అజ్ఞాబి’ , ‘ఐత్రాజ్’ (2004) చిత్రాలకు సంతకం చేసింది. కానీ సుష్మితా సేన్ తన కుమార్తె అనారోగ్యం కారణంగా సినిమాలను విడిచిపెట్టింది. రిని తర్వాత సుస్మితా సేన్ మరో అమ్మాయిని దత్తత తీసుకుంది. 48 ఏళ్ల సుస్మితా సేన్ పెళ్లి చేసుకోకుండానే దత్తత ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : సుమన్ శెట్టి ప్రభంజనం.. బిగ్‏బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్.. 14 వారాలకు ఎంత సంపాదించాడంటే..

ఇవి కూడా చదవండి :  Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..