
బుల్లితెరపై ఎన్నో సీరియల్లలో విలన్ పాత్రలతో అదరగొట్టేసింది. అందమైన గ్లామర్ బ్యూటీ.. కానీ టీవీల్లో మాత్రం క్రూరత్వంతో ప్రేక్షకులను సైతం భయపెట్టేస్తుంది. ఒక్కో ఎపిసోడ్ లో ఆమె పాత్ర కనిపిస్తే చాలు ప్రేక్షకులను ఎక్కడలేని కోపం వస్తుంది. అతంగా తన పాత్రకు న్యాయం చేస్తూ తెలుగు అడియన్స్ కు దగ్గరవుతుంది ఈ బ్యూటీ. అయితే సీరియల్లో ఎప్పుడూ సింపుల్ గా చీరకట్టులో కనిపించే ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ అరాచకం సృష్టిస్తుంది. అటు ట్రెడిషనల్, ఇటు మోడ్రన్ లుక్స్ లో సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న వయ్యారిని గుర్తుపట్టారా.. ? ఆమె బుల్లితెర ప్రేక్షకులకు చాలా సుపరిచితం. అందం, అభినయంతో మెప్పిస్తోన్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఆమె మరెవరో కాదు.. ప్రేమ ఎంత మధురం ఫేమ్ మాన్సీ అలియాస్ మహేశ్వరి.
టీవీల్లో ప్రేమ ఎంత మధురం సీరియల్ కు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో అను, ఆర్య పాత్రలను ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఇక అదే సీరియల్లోని మాన్సీ పాత్రను సైతం అంతగానే ద్వేషిస్తారు. విలన్ పాత్రలో ఆమె నటనను చూస్తే ప్రేక్షకులకు ఎక్కడలేని కోపం వస్తుంది. అంతగా తన పాత్రకు న్యాయం చేస్తుంది. మహేశ్వరి పక్కా గుంటూరు అమ్మాయి. కెరీర్ తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ పాపులర్ అయ్యింది. ఇండస్ట్రీలోకి వచ్చి 5 ఏళ్లు అవుతున్నప్పటికీ విలన్ పాత్రలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. తాను ఇంటర్ చదువుతున్నప్పుడే నా కోడలు బంగారం సీరియల్ అడిషన్స్ కు వచ్చానని.. 600 మందిలో తను సెలక్ట్ అయినట్లు తెలిపింది.
ఆ తర్వాత రాధమ్మ కూతురు, ప్రేమ ఎంత మధురం సీరియల్స్ ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంది. మహేశ్వరికి ఎక్కువగా విలన్ పాత్రలే రావడం గమనార్హం. తన ళ్లు కొంచెం పెద్దవిగా ఉండడంతో తనకు ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్స్ వస్తున్నాయని గతంలో చెప్పుకొచ్చింది. విలన్ పాత్రలు చేయడం వల్ల తనను నిజంగా కూడా చాలా మంది తిడతారని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. చీరకట్టులో, మోడ్రన్ డ్రెస్సులలో మరింత అందంగా కనిపిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..