Actress : ఇండస్ట్రీలో సంచలనం.. 20 ఏళ్లలో 3 పెళ్లిళ్లు.. 3 విడాకులు.. నెట్టింట హాట్ టాపిక్ ఈ హీరోయిన్..

సాధారణంగా సినీరంగంలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనేది కామన్. ఈమధ్య కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. అంతలోనే డివోర్స్ తీసుకోవడం చూస్తున్నాం. కానీ ఓ హీరోయిన్ మాత్రం 20 సంవత్సరాలలో 3 పెళ్లిళ్లు చేసుకుంది. ఇటీవలే తన మూడో భర్తకు సైతం విడాకులు ఇచ్చినట్లు ప్రకటించి ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Actress : ఇండస్ట్రీలో సంచలనం.. 20 ఏళ్లలో 3 పెళ్లిళ్లు.. 3 విడాకులు.. నెట్టింట హాట్ టాపిక్ ఈ హీరోయిన్..
Meera Vasudevan

Updated on: Nov 28, 2025 | 9:04 PM

సినీరంగంలో నటీనటులు వ్యక్తిగత విషయాలు గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ మధ్య ప్రేమ, పెళ్లి అంటూ నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంది. కానీ ఇప్పుడు నెట్టింట ఓ హీరోయిన్ హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఇటీవలే తన మూడో భర్తకు సైతం విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మీరా వాసుదేవన్. చిత్రపరిశ్రమలో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 13B సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇటీవల ఆమె తన మూడో భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చింది.

ఇవి కూడా చదవండి : Tollywood : కుర్రాళ్లకు మెంటలెక్కించిన హీరోయిన్.. కట్ చేస్తే.. అవకాశాల కోసం ఎదురుచూపులు..

“ఈ ఏడాది ఆగస్ట్ నుంచి నేను సింగిల్ గా ఉంటున్నాను. ఇప్పుడే నా జీవితంలో అత్యంత అద్భుతమైన.. ప్రశాంతమైన దశ అని నేను భావిస్తున్నాను “అంటూ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె మూడో పెళ్లి సైతం ముగిసిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం మీరా వాసుదేవన్ వయసు 43 సంవత్సరాలు. ఇప్పటికే ఆమె పర్సనల్ లైఫ్ గురించి నెట్టింట చర్చ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..

మీరా వాసుదేవన్ 2005లో విశాల్ అగర్వాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఐదేళ్లకు మనస్పర్థలతో 2010లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లు ఒంటరిగా ఉన్న ఆమె.. 2012లో జాన్ కొక్కెన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. అతడు కేజీఎఫ్, సార్పట్ట వంటి చిత్రాల్లో నటించాడు. వీరికి అరిహా అనే కుమారుడు ఉన్నాడు. కానీ పెళ్లైన నాలుగేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. గతేడాది 2023లో సినిమాటోగ్రాఫర్ విపిన్ ను పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ బంధం సైతం ముగిసినట్లు తెలుస్తోంది. మీరా వాసుదేవన్.. 2003లో జేడీ చక్రవర్తి హీరోగా వచ్చిన గోల్ మాల్ అనే సినిమాతో కథానాయికగా పరిచయమైంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలోల అనేక చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి :  Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్‏తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..

Meera Vasudevan Movies

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..