
రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనం.. ఆయన సినిమాలతోనే కాదు.. ఆయన చేసిన కామెంట్స్ కూడా అంతే వైరల్ అవుతూ అవుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఆర్జీవీ చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమాల పైనే కాదు రాజకీయాల పైన కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు ఆర్జీవీ. ఇటీవలే ఆయన సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ ను పట్టుకున్నారు. సోషల్ మీడియా లో వీడియోలు చేసే ఓ యువతీ అందానికి ఫిదా అయ్యారు ఆర్జీవీ. ఆమె ఎవరు అంటూ నెటిజన్స్ ను అడిగిమరీ ఆమెను వెతికి పట్టుకున్నారు ఆర్జీవీ. ఆమె పేరు ఆరాధ్య దేవి. ఆమెతో ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. శారీ అనే సినిమా చేస్తున్నారు ఆర్జీవీ. ఇప్పటికే ఈ సినిమానుంచి పోస్టర్ ను విడుదల చేశారు వర్మ.
తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు ఆర్జీవీ. చేతిలో మందు గ్లాస్ తో ఓ అందమైన అమ్మాయితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ సంచలన దర్శకుడు. ఆర్జీవీ పక్కన ఉన్న ఆ అందమైన అమ్మాయి ఎవరో తెలుసా.. ఆమె పేరు సిరి స్టేజీ..
ఆమె ఆర్జీవీ ఫ్యాన్ గర్ల్.. అర్జీవిని ఇంటర్వ్యూ చేసి క్రేజ్ సొంతం చేసుకుంది సిరి స్టేజీ. ఆతర్వాత అర్జీవితో కలిసి కనిపిస్తూ హల్ చల్ చేసింది ఈ చిన్నది. తాజాగా ఈ ఇద్దరు పబ్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆర్జీవీ. ఆమెతో కలిసున్నా ఫోటోలను వరుసగా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆర్జీవీ. ఓ ఫొటోకు లైఫ్ లో క్లారిటీ ఉండాలి బ్రో అని రాసుకొచ్చారు. మరో ఫొటోకు మీరు కుళ్లుతో చచ్చిపోతే ఇంకో రెండు పెగ్గులు తాగుతా అని రాసుకొచ్చారు ఆర్జీవీ. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
GOOD NIGHT and BITTER DREAMS 🤣 pic.twitter.com/1AlGOB9AhG
— Ram Gopal Varma (@RGVzoomin) February 4, 2024
Cheeeeeeeeerrrrrrrrssssssssss!🔥 Meeru kullutho chachchipothe inko rendu peggulestha😎 pic.twitter.com/a9eBvjf8kl
— Ram Gopal Varma (@RGVzoomin) February 4, 2024
She https://t.co/M9RyYt9Yav is the ANGEL and I am the DEVIL 😈 pic.twitter.com/sA4F6qnEpC
— Ram Gopal Varma (@RGVzoomin) February 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..