Nara Rohith-Sireesha: కొత్త దంపతులు నారా రోహిత్, శిరీషల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం (అక్టోబర్ 31)న హీరోయిన్ శిరీష లేళ్లతో కలిసి ఏడడుగులు నడిచాడు. హైదరాబాద్ లో జరిగిన వీరి వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Nara Rohith-Sireesha: కొత్త దంపతులు నారా రోహిత్, శిరీషల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
Nara Rohith Marriage

Updated on: Nov 01, 2025 | 6:21 PM

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నారా రోహిత్- శిరీష లేళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం (అక్టోబర్ 31) జరిగిన వీరి వివాహ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు. నారా రోహిత్ పెద నాన్న, ఏపీ ముఖ్యమంత్రి- భువనేశ్వరి దంపతులతో పాటు పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు నారా రోహిత్- శిరీషల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం నారా రోహిత్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. సినీ అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో నారా రోహిత్ భార్య శిరీష గురించి నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.

శిరీషది ఏపీలోని రెంట చింతల. బ్యాచిలర్ డిగ్రీ వరకు ఇక్కడే చదువుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసింది. కొన్ని రోజుల పాటు ఉద్యోగం కూడా చేసింది. అయితే సినిమా ఇండస్ట్రీపై మక్కువతో తిరిగి ఇండియాకు వచ్చేసింది. హైదరాబాద్ లో తన అక్క దగ్గర ఉంటూ సినిమా ఆడిషన్స్ కు హాజరైంది. ఇదే క్రమంలో ప్రతినిధి-2 మూవీ ఆడిషన్స్ కు హాజరై హీరోయిన్ గా ఎంపికైంది. ఆ తర్వాత నారా రోహిత్ తో ప్రేమలో పడిపోయింది. కాగా ఈ కొత్త దంపతుల ఏజ్ గ్యాప్ గురించి నెట్టిం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రోహిత్ వయసు సుమారు 40 ఏళ్లు కాగా, సిరి వయసు సుమారు 29 సంవత్సరాలు. అంటే వీరిద్దరి మధ్య 11 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గ్యాప్ ఉన్నా నారా రోహిత్- శిరీష లేళ్ల జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నారా రోహిత్-శిరీషల పెళ్లి వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది రెండు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు నారా రోహిత్. భైరవం, సుందర కాండ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..