R.Madhavan: లగ్జరీ ఫ్లాట్‏ను అద్దెకు ఇచ్చిన హీరో మాధవన్.. నెలకు రెంట్ తెలిస్తే ఫ్యూజుల్ అవుట్..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో లవర్ బాయ్. అప్పట్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మాధవన్ ఒకరు. ముఖ్యంగా లవ్ స్టోరీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తమిళ చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

R.Madhavan: లగ్జరీ ఫ్లాట్‏ను అద్దెకు ఇచ్చిన హీరో మాధవన్.. నెలకు రెంట్ తెలిస్తే ఫ్యూజుల్ అవుట్..
Madhavan

Updated on: Jun 25, 2025 | 11:04 AM

ఆర్.మాధవన్.. సౌత్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. ఒకప్పుడు ప్రేమకథ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్. ఇప్పుడు విభిన్నమైన కథలతో కట్టిపడేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా దక్షిణాదిలో కాకుండా ఎక్కువగా హిందీలో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా మాధవన్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ప్రీమియం లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. నివేదికల ప్రకారం మాధవన్ ఈ లగ్జరీ ఫ్లాట్ ను నెలకు రూ.6.5 లక్షల అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

సిగ్నియా పెర్ల్ రెసిడెన్షియల్ టవర్‌లో ఉన్న 4,182 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను మాధవన్ అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. ఈ భవనాన్ని భారతీయ అనుబంధ సంస్థ అయిన బీపీ ఎక్స్‌ప్లోరేషన్ (ఆల్ఫా) లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చారు. జూన్ 11, 2025న నమోదైన లీజు ఒప్పందం రెండేళ్ల కాలానికి. ఈ కాలంలో, మాధవన్ దాదాపు రూ.1.60 కోట్ల అద్దెను అందుకుంటారు. ఇప్పటికే మాధవన్ రూ.39 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా అందుకున్నారట.

ఒప్పందం ప్రకారం మొదటి సంవత్సరం నెలవారీ అద్దె రూ. 6.5 లక్షలు కాగా.. రెండవ సంవత్సరం 5% పెరుగుదల ఉంటుంది. అంటే నెలవారీ అద్దె దాదాపు రూ. 6.83 లక్షలు.. ఇక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి రూ.47,000 స్టాంప్ డ్యూటీ, రూ. 1,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. మాధవన్ 2024 జూలైలో రూ.17.5 కోట్లకు ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..