AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏంటీ.. ఈ హీరోస్ అందరికీ సొంతంగా విమానాలు ఉన్నాయా..? ప్రైవేట్ జెట్స్ ఉన్న తారలు వీళ్లే..

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా సంపాదించారు. అలాగే సల్మాన్ ఖాన్ రూ.2 వేల కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నాయి. వీరిద్దరే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ నటీనటులకు సొంతం ప్రైవెట్ జెట్స్ ఉన్నాయి. కానీ టాలీవుడ్ సినీ పరిశ్రమలోనూ పలువురు టాప్ హీరోలు కూడా సొంతంగా విమానాలు కలిగి ఉన్నారు. సినిమా ప్రమోషన్ల కోసం ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లేందుకు అదే విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంతకీ ఆ తరాలు ఎవరో తెలుసుకుందామా.

Tollywood: ఏంటీ.. ఈ హీరోస్ అందరికీ సొంతంగా విమానాలు ఉన్నాయా..? ప్రైవేట్ జెట్స్ ఉన్న తారలు వీళ్లే..
Prabhas, Ram Charan, Ntr
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2024 | 11:37 AM

Share

సాధారణంగా సినీ పరిశ్రమలో ఎప్పుడూ స్టార్ నటీనటుల సినిమాలు, రెమ్యునరేషన్ గురించి చర్చలు జరుగుతుంటాయి. ఇప్పుడున్న తారలు ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే సెలబ్రెటీల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి ఎక్కువగా చూపిస్తుంటారు. అందుకే ఇప్పుడు తెలుగు హీరోహీరోయిన్స్ నెట్ వర్త్, లగ్జరీ కార్స్, విల్లాస్ గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా సంపాదించారు. అలాగే సల్మాన్ ఖాన్ రూ.2 వేల కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నాయి. వీరిద్దరే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ నటీనటులకు సొంతం ప్రైవెట్ జెట్స్ ఉన్నాయి. కానీ టాలీవుడ్ సినీ పరిశ్రమలోనూ పలువురు టాప్ హీరోలు కూడా సొంతంగా విమానాలు కలిగి ఉన్నారు. సినిమా ప్రమోషన్ల కోసం ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లేందుకు అదే విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంతకీ ఆ తరాలు ఎవరో తెలుసుకుందామా.

అక్కినేని నాగార్జున.. అక్కినేని నాగార్జున టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్. సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎంతో గౌరవం ఉంది. అతనికి సొంత విమానం ఉంది. వెకేషన్‌ను ఎంజాయ్ చేసేందుకు ఒకే విమానంలో కుటుంబసభ్యులతో కలిసి చాలా ప్రాంతాలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి సినిమాకి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. బన్నీకి ప్రైవేట్ జెట్ ఉంది. స్నేహారెడ్డితో పెళ్లి తర్వాత బన్నీ తనకంటూ ఓ ప్రైవేట్ జెట్ కొన్నారు. ‘రేసు గురమ్‌’ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా అల్లు అర్జున్ అదే విమానంలో ప్రయాణించారు. అదే విమానాన్ని ‘పుష్ప’ సినిమా ప్రమోషన్‌కు ఉపయోగించారు.

మెగాస్టార్ చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. చిరు వద్ద సొంతంగా చార్టర్ విమానం ఉంది. తన సినిమాలను ప్రమోట్ చేయడానికి.. లేదా కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లడానికి అదే విమానాన్ని ఉపయోగిస్తుంటారు.

పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ కు ప్రైవేట్ జెట్ ఉంది.

జూనియర్ ఎన్టీఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నాడు. అలాగే హిందీలో వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. తారక్ వద్ద ప్రైవేట్ జెట్ ఉంది.

రామ్ చరణ్. రామ్ చరణ్ కు ప్రైవేట్ జెట్ ఉంది. అందులో ప్రయాణించడం అంటే ఇష్టం. ఆయన తన భార్య ఉపాసన కొణిదెళ్లతో కలిసి చాలాసార్లు ఈ విమానంలో ప్రయాణించారు.

మహేష్ బాబు.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. త్వరలోనే వీరిద్దరి కాంబోలో ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ వెళ్తుంటాడు. మహేష్ వద్ద సొంతంగా విమానం ఉంది.

ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్ అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ హీరో నటించిన కల్కి మూవీ రేపు అడియన్స్ ముందుకు రానుంది. ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటాడు. అలాగే సొంతంగా విమానం ఉంది.

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు