
పుష్ప 2.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు మారుమోగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో ఈ సినిమా అదరగొట్టేస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ సుకుమార్ టేకింగ్, డైరెక్షన్.. ఇక అల్లు అర్జున్ అద్భుతమైన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పుష్ప 2 నిజంగానే వైల్డ్ ఫైరూ అన్నట్లుగా సినిమా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్ తమ నటనతో మెప్పించారు. అయితే ఈ సినిమాలో లీడ్స్ కాకుండా కథను మలుపు తిప్పే పాత్రలో కీలక రోల్ పోషించి అందరి చూపు తనవైపు తిప్పుకుంది పావని అనే అమ్మాయి. ఇందులో అజయ్ కూతురిగా కనిపించింది. బన్నీని చిన్నాన్న అంటూ పిలుస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇక ఈ సినిమాలో పావని పాత్ర వల్ల కథే మలుపు తిరుగుతుంది.ఇందులో కీలకంగా ఉన్న ఈ అమ్మాయి పాత్ర గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ? తను అచ్చ తెలుగమ్మాయి. ఇప్పటికే తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. పరేషాన్, పైలం పిలగా సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా పరేషాన్ సినిమాలోని సమోసా తింటావా శిరీష అనే డైలాగ్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది.
అంతేకాకుండా హిట్ 2 సినిమాతోపాటు.. అందుకు ముందు పుష్ప 1లో కాసేపు కనిపించింది. ఇప్పుడు పుష్ప 2లో ఆమె పాత్ర ఎక్కువసేపు కనిపించింది. పావని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ఈ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు తెగ వెతుకున్నారు నెటిజన్స్.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.