
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు, పరిశ్రమలోని అత్యంత సంపన్న నటులలో ఒకరు కూడా. హీరోగా, నిర్మాతగా, హోస్ట్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తన కృషి, పట్టుదల, అంకితాభావంతో కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నాని, రాజమౌళి కాంబోలో వచ్చిన ఈగ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇందులో విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. ఇదిలాఉంటే.. ఈగ, పైల్వాన్, విక్రాంత్ రోనా వంటి సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..
కిచ్చా సుదీప్ ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 8 నుండి 10 కోట్లు తీసుకుంటాడని సమాచాం. చాలా ప్రాజెక్టులకు, అతను తన రెమ్యునరేషన్ తోపాటు లాభాల్లో వాటా తీసుకుంటారు. 2022లో విక్రాంత్ రోనా తర్వాత, సుదీప్ ప్రజాదరణ ఎంతగా పెరిగిందంటే.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 20 కోట్లు వసూలు చేస్తున్నారట. నివేదికల ప్రకారం బిగ్ బాస్ షో హోస్ట్ చేయడానికి ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు రూ.2 కోట్లు తీసుకుంటారని సమాచారం.
అలాగే యాడ్స్ కోసం రూ.2 కోట్లు తీసుకుంటారట. ఆయన కన్నడలో సొంతంగా కిచ్చా క్రియేషన్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి పలు చిత్రాలను నిర్మించారు. బెంగళూరులో రూ. 20 కోట్ల విలువైన ఇల్లు ఉందని టాక్. అతని గ్యారేజీలో BMW 7 సిరీస్, జాగ్వార్ XJ, రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడెస్-బెంజ్ GLS వంటి అనేక రకాల ఖరీదైన కార్లు ఉన్నాయి. నటుడు కూడా బైక్ ప్రియుడు, కాబట్టి అతను కొన్ని సూపర్ బైక్‌లను కలిగి ఉన్నాడు. నివేదికల ప్రకారం అతడి ఆస్తులు రూ.165 కోట్లు ఉంటుందని సమాచారం.
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..