సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ అజిత్ కు మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. అజిత్ ను అభిమా కులంతా తలా అం ఐ పిలుచుకుంటూ ఉంటారు. ఇక అజిత్ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకు పండగే.. కటౌట్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ అభిమానులు రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక అజిత్ వ్యక్తిగత విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అజిత్ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అజిత్ కు ఒక లవ్ ఫెల్యూర్ స్టోరీ కూడా ఉందట..
ఒకప్పుడు అజిత్ లవర్ బాయ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన కోసం లేడీ ఫ్యాన్ పీఛెక్కి పోయేవారు. అయితే హీరోగా రాణిస్తున్న సమయంలో అజిత్ ప్రేమలో పడ్డారు. మొదటి ఓ హీరోయిన్ ను ప్రేమించారు అజిత్ ఆమె ఎవరోకాదు. హీరా రాజగోపాల్. అప్పట్లో వీరి ప్రేమ కథ పెద్ద సంచలనమే.. చాలా కాలం ఈ ఇద్దరు గుట్టుగా ప్రేమించుకున్నారు. ఒకరికోసం ఒకరు ప్రేమ లేఖలు కూడా రాసుకున్నారు. అజిత్, హీరా లు కాదల్ కొట్టై అనే సినిమాలో నటించారు. అప్పుడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. అప్పట్లో నటుడు బయిల్వాన్ రంగనాథన్ వీరి ప్రేమ కథను చెప్పడంతో బయట ప్రపంచానికి వీరి లవ్ స్టోరీ తెలిసింది. అజిత్ రాసిన ప్రేమ లేఖలు కూడా అతడు చదివానని తెలిపాడు. అయితే
వీరిప్రేమ పెళ్లివరకు వెళ్తుందని అంతా అనుకునే సమయంలో హీరా రాజగోపాల్ తల్లి వీరి ప్రేమను నిరాకరించింది. ఆమె ఎట్టిపరిస్థితిలో వీరి పెళ్ళికి ఒప్పుకునేది లేదని చెప్పడంతో.. ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత అజిత్ హీరోయిన్ షాలిని తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. వీరి ప్రేమ పెళ్లి వరకు చేరింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన మొదటి లవ్ ఫెయిల్యూర్ బాధలో నుండి బయటపడటానికి షాలిని ప్రేమ తోడయ్యింది. ఇప్పుడు అజిత్ ఫ్యామిలీతో చాలా సంతోషంగా గడుపుతున్నారు.