Tollywood : యాంకర్ నుంచి హీరో వరకు.. హిట్ మ్యాన్ శివకార్తికేయన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని సాధారణ యువకుడు నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. బుల్లితెరపై యాంకర్ గా సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ హీరో.. ఇప్పుడు వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్నాడు. తాజాగా శివకార్తికేయన్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది.

Tollywood : యాంకర్ నుంచి హీరో వరకు.. హిట్ మ్యాన్ శివకార్తికేయన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
Sivakarthikeyan

Updated on: Jan 26, 2026 | 9:46 PM

తమిళ్ హీరో శివకార్తికేయన్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో.. ఇటీవల ప్రిన్స్, అమరన్ చిత్రాలతో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తమిళంలో హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే సంక్రాంతి పండక్కి పరాశక్తి మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా శివకార్తికేయన్ సంపాదన, సినిమాలు, ఆస్తుల గురించి తెగ ఆరా తీస్తున్నారు. స్మాల్ స్క్రీన్‌పై తన మిమిక్రీ, టైమింగ్ కామెడీతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటుడు శివకార్తికేయన్ 2013 చిత్రం ‘మెరీనా’తో హీరోగా పరిచయం అయ్యాడు. అంతకు ముందు కొన్ని ప్రకటనలు, సినిమాల్లో కనిపించిన శివ.. ‘వరుత్తపడ వాలిబర్ సంగం’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

ఇటరారీనీచల్, మాన్ కరాటే, కాకిచ్చట్టై, రజనీ మురుగన్, రెమో, వేలైక్కారన్, సీమరాజా, మిస్టర్ లోకల్, నమ్మ వీటుప్ పిళ్లై, డాక్టర్, డాన్, ప్రిన్స్, మావీరన్, అళయన్, అమరన్, మదరాసి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రస్తుతం టాప్ 10 నటుల్లో ఒకరిగా మారారు. శివకార్తికేయన్ ఒక్కో సినిమాకు రూ .30 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు టాక్.

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..

అలాగే నివేదికల ప్రకారం శివకార్తికేయన్ ఆస్తుల విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుంది. చెన్నైలో ఒక భారీ బంగ్లాను కలిగి ఉన్నాడు. ఈ ఇంట్లో జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అలాగే అతనికి మినీ కూపర్ , బెంజ్, BMW వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి . నటుడిగానే కాకుండా, నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..

ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..