HanuMan: హనుమాన్ సినిమా పై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ ప్రశంసలు..

ప్రస్తుతం దేశమంతా అయోధ్య వైపు ఆసక్తి చూస్తున్న నేపథ్యంలో హనుమాన్ సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్రయూనిట్ ఆనందంలో తేలిపోతుంది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా పలు భాషల్లో విడుదలైంది. విడుదలైన అన్ని బాషల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది.

HanuMan: హనుమాన్ సినిమా పై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ ప్రశంసలు..
Hanuman

Updated on: Jan 18, 2024 | 4:24 PM

సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం దేశమంతా అయోధ్య వైపు ఆసక్తి చూస్తున్న నేపథ్యంలో హనుమాన్ సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్రయూనిట్ ఆనందంలో తేలిపోతుంది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా పలు భాషల్లో విడుదలైంది. విడుదలైన అన్ని బాషల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. సామాన్యులే కాకుండా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శివరాజ్‌కుమార్, నందమూరి బాలకృష్ణ తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ‘హనుమాన్’ సినిమాపై ట్వీట్ చేశారు.

‘హనుమాన్’ టీమ్ అనురాగ్ ఠాకూర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను అనురాగ్ ఠాకూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్విట్టర్ లో షేర్ చేసిన ఆయన చిత్రయూనిట్ మెచ్చుకున్నాడు. అనురాగ్ ఠాకూర్ ‘హనుమాన్’ సినిమా ఓ అద్భుత కళాఖండమని కొనియాడారు. హనుమాన్ మన సనాతన ధర్మం గురించిన ఒక కళాఖండం. సినిమా గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. చిత్రబృందం కృషి కనిపిస్తుంది. నేను హనుమాన్ టీమ్‌ను అభినందిస్తున్నాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటుడు తేజ సజ్జా, నిర్మాత నిరంజన్ రెడ్డి, వారి టీమ్ అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని అనురాగ్ ఠాకూర్ పోస్ట్ చేశారు. అలాగే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా హనుమాన్ సినిమా పై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ‘హనుమాన్’ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఆంజనేయుడి నుంచి సూపర్ పవర్ పొందే ఓ యువకుడి కథే ఈ సినిమాలో చూపించారు.  తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ ‘హనుమాన్’ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో దూసుకుపోతోంది.

కిషన్ రెడ్డి ట్వీట్టర్ పోస్ట్

అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.