Aamir Khan: విడాకుల పై షాకింగ్ కామెంట్స్ చేసిన అమీర్ ఖాన్ మాజీ భార్య..

లాల్ సింగ్ చద్దా సినిమాపై అమీర్ ఖాన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాప్ అయినప్పటి నుంచి అమీర్ ఖాన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇదిలావుండగా అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం కారణంగా లైమ్‌లైట్‌లో ఉంటున్నారు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ తాజాగా ఓ పెద్ద విషయాన్ని రివీల్ చేసింది. కిరణ్‌రావు ప్రస్తుతం తన రాబోయే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.

Aamir Khan: విడాకుల పై షాకింగ్ కామెంట్స్ చేసిన అమీర్ ఖాన్ మాజీ భార్య..
Ameer Khan

Updated on: Feb 14, 2024 | 6:51 PM

బాలీవుడ్ స్టార్ హీరోఅమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా  సినిమా తర్వాత ఇంతవరకు మరో సినిమాను అనౌన్స్ చేయలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏమాత్రం విజయం సాధించలేదు. ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. లాల్ సింగ్ చద్దా సినిమాపై అమీర్ ఖాన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాప్ అయినప్పటి నుంచి అమీర్ ఖాన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇదిలావుండగా అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం కారణంగా లైమ్‌లైట్‌లో ఉంటున్నారు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ తాజాగా ఓ పెద్ద విషయాన్ని రివీల్ చేసింది.

కిరణ్‌రావు ప్రస్తుతం తన రాబోయే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కిరణ్‌రావు అమీర్‌ఖాన్‌తో విడాకుల గురించి మాట్లాడారు. మేమిద్దరం విడాకుల తర్వాత కూడా కలిసి పనిచేస్తున్నామని కిరణ్‌రావు తెలిపారు.  మా సంబంధం ఖచ్చితంగా వివాహానికి పరిమితం కాదు. మేమిద్దరం పెళ్లి గురించి ఆలోచించినప్పుడు, ఇద్దరం ఒకరి గురించే ఆలోచిస్తాం. మన పనికి మనల్ని దగ్గర చేస్తుంది. మా సంబంధం చాలా కుటుంబపరంగా పవిత్రమైంది అని తెలిపింది. మన నిజాయితీ మన బంధానికి పునాది.. మాకు ఎప్పుడూ గొడవలు లేవు అని తెలిపారు కిరణ్ రావ్.

అలాగే మేము విడిగా ఉండాలనుకున్నాం అంతే కానీ మేము మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకోలేదు.. విడాకులు తీసుకున్న తర్వాత కూడా కలిసి ఉన్నాం.. మేము ఒకే భవనంలో నివసిస్తున్నాము, ఆహారం కూడా పంచుకుంటాము. నిజం చెప్పాలంటే, మా పెళ్లి తర్వాత మా సంబంధం విడిపోయి ఉంటే అది మరింత ఘోరంగా ఉండేది. కానీ అలా లేదు అని చెప్పుకొచ్చారు కిరణ్. అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ వివాహానికి కిరణ్ రావు కూడా హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన చాలా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిరణ్ రావ్ అమీర్ ఖాన్ రెండో భార్య. కిరణ్, అమీర్‌ఖాన్‌లకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

అమీర్ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అమీర్ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.