సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తెలుగు చిత్రసీమలో అగ్రపథంలో దూసుకెళ్తున్నారు. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీతో ఈ సంక్రాంతికి బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం ఫ్యామిలితో కలిసి ఫారెన్ వెకేషన్‌కు వెళ్లిన మహేశ్..విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక సూపర్‌స్టార్ తదుపరి సినిమా కూడా ఓకే అయ్యింది. ఆయన నెక్ట్స్ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో ‘మహార్షి’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అబ్డేట్ ఫిల్మ్ నగర్‌లో సర్కులేట్ అవుతోంది. మహేశ్ నెక్ట్స్ మూవీ హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫైనల్ అయినట్టు సమాచారం. గతంలో ఈ క్రేజీ జోడీ ‘భరత్ అనే నేను’లో ఆడిపాడింది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ..త్వరలోనే మూవీ టీమ్ అఫిషయల్ అనౌన్స్‌మెంట్ చేయనుంది. స్పై థ్రిల్లర్ కథాశాంతో రూపొందే ఈ చిత్రాన్ని ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మంచనున్నారు.